ఈగ సినిమా దాదాపుగా మనందరం చూసేవుంటాం.ఒక చిన్న ప్రాణి విలన్ పై ఎలా కక్ష తీర్చుకుందో డైరెక్టర్ అందులో చూపిం చాడు.ఆ సినిమా చుసిన వాళ్లు ఇదొక ఇమాజేషన్ అనుకొని వుంటారు.ఉఫ్ అని వూదితే ప్రాణం పోయే ప్రాణి,ప్రాణం తీయడమేం టని అనుకొని వుంటారు.ప్రాణి చిన్న దైనా,పెద్ద దైనా పగ పగే అని మరో మారు రుజువైంది.అది ఓ పక్షితో,ఇంతకు ఏం జరిగిం దంటే.కాకులు ఓ వ్యక్తిపై కక్ష కట్టాయి అనగానే ఆశ్చర్యపోకండి,నిజంగానే కాకులు ఈ వ్యక్తిపై ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడేళ్ల నుంచి అవి అతడిపై కక్షతీర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ కాకులు కూడా ఈగ సినిమా చూసినట్లున్నా యి.అందుకే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే చాలు.. ఆకస్మికంగా దాడి చేస్తాయి.అతడు రోడ్డు మీద నడుస్తున్నంత సేపు అవి వెంటాడుతూనే ఉంటాయి.అతడిని ముక్కుతో,గోళ్లతో పొడిచేందుకు ప్రయత్నిస్తాయి.ఇది నిజమండి బాబోయ్.



మధ్యప్రదేశ్‌లోని శివపురిలో గల సుమెలా గ్రామంలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు శివకేవత్.మూడేళ్ల కిందట ఓ మంచి పని చేయ బోయి కాకుల దృష్టిలో విలన్ అయ్యాడు ఓరోజు మార్గ మధ్యలో ఓ కాకి ఇనుప కంచెలో చిక్కుకుని విలవిల్లాడటాన్నిచూసిన శివ, దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు.ఆ క్రమంలో ఆ కాకి అతడి చేతిలో చనిపోయింది.దీంతో మిగతా కాకులు,శివనే,,శివ సిని మాలో నాగార్జునలా చైన్ పట్టుకుని ఆ కాకిని చంపేశాడని భావించాయి.ఆ రోజు నుంచి శివ ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే చాలు,ఫ్యాక్ష నిస్టుల్లా అదను చూసి దాడి చేస్తుంటాయి.ఒక్కోసారి గుంపుగా,మరోసారి సింగిల్‌గా వచ్చి అతడిని ముప్పు తిప్పలు పెడుతున్నాయి.ఈ విషయం ఎవరితోచెప్పుకున్నానమ్మే వారు కాదట.



ఇటీవల శివ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’జర్నలిస్టుతో తన సమస్యను చెప్పుకుంటు తలపై ఉన్న దెబ్బలు చూపించి,కాకుల దాడికి తన తల పుండులా మారిపోయిందని వాపోయా డట.ఇక శివ ఎదుర్కొంటున్న సమస్యపై భోపాల్‌లోని బర్గతుల్లా యూనివర్శిటీ ప్రొఫెసర్ అశోక్ కుమార్ ముంజల్ స్పందిస్తూ.తమకు కీడు చేసే వ్యక్తులను కాకులు గుర్తుపెట్టు కుంటాయని.ఇతర కాకులకు సైతం ఆ వ్యక్తి సమాచారాన్ని చెబుతాయని అందుకే అవన్ని కలిసి దాడి చేస్తుంటాయని తెలిపారు.మంచికి పోతే చెడు ఎదురైన ట్లు.ఆ వ్యక్తి కాకు లతో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.బయట పనులు చేయాలంటేనే హడలిపోతున్నాడు.మరి ఆ కాకులు అతడిని ఎప్పుడు అర్థం చేసుకుంటాయో నిజాన్ని ఎప్పుడు గ్రహించి తమ పగను విరమించుకుంటాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: