ఆగస్టు 5 న జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసిన తరువాత మొదటిసారిగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెప్టెంబర్ 3 న మాట్లాడుతూ  "పరిశ్రమలు, ఆసుపత్రులు ఇంకా విద్యా సంస్థలను స్థాపించడానికి ప్రభుత్వ భూమి మాత్రమే ఉపయోగించబడుతాయి" అని అన్నారు.

ఆయన జమ్మూ కాశ్మీర్ లోని సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు మరి కోంత మంది పౌర సమాజ సమూహాల సభ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం తో‌ మాట్లాడుతూ , “ఎవరి భూమి కూడా తీసుకోబడదు” అని అన్నారు. గత సంవత్సరం ఎన్నికైన గ్రామ పెద్దలు కొంత మంది భద్రత కోరుతూ, దక్షిణ కాశ్మీర్ లో కొంతమంది ఇప్పటికీ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళలేకపోవడంతో పోలీసు రక్షణలో శ్రీనగర్ లోని హోటళ్ళలో నివసిస్తున్నారు అని తెలిపారు.

ఆగస్టు 5 న రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న షా, ఆర్టికల్స్ 370 మరియు 35A కారణంగా భూమి కొనుగోలుపై ఆంక్షలు ఉన్నందున రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయలేమని, పర్యాటక రంగం అభివృద్ధి చెయలేమని చెప్పారు. ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను ఉపసంహరించుకోవడానికి షా రెండు బిల్లులను తీసుకువచ్చారు, దానివల్ల రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ప్రత్యేక హోదాను రద్దు చేసిన తరువాత, కాశ్మీర్ లోయ, జమ్మూ నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి భూమి, సంస్కృతి మరియు సంప్రదాయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

రాబోయే 20-25 రోజుల్లో ఇంటర్నెట్‌తో సహా కమ్యూనికేషన్ సేవలను లోయలో పునరుద్ధరిస్తామని  షా ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాలను త్వరగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఆయన, ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురిని మెరిట్ ఆధారిత నియామకాలను ప్రభుత్వం నిర్ధారిస్తుందని చెప్పారు. పరిస్థితి హామీ ఇచ్చిన వెంటనే రాష్ట్రం పునరుద్ధరించబడుతుందని ఆయన పునరుద్ఘాటించారు, పుకార్లను నమ్మవద్దని ఆ ప్రతినిధులను కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: