వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తరువాత కీలక నేతగా బొత్స సత్యనారాయణ మారారని తెలుస్తోంది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత కొన్నిరోజులుగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వానికి సంబంధించిన విషయాల గురించి మీడియాతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీలో బొత్స సత్యనారాయణ ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. 
 
వైసీపీ పార్టీలో ఎంపీ విజయసాయి రెడ్డి స్థానాన్ని ప్రస్తుతం బొత్స సత్యనారాయణ భర్తీ చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి గురించి వివిధ సందర్భాలలో బొత్స సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీ రాజధానిగా వేరే ప్రాంతం గురించి సర్వే చేస్తున్నట్లు మీడియాతో చెప్పారు. వర్షాలు, వరదలకు రాజధాని అమరావతి మునిగిపోతుందని కూడా వ్యాఖ్యలు చేసారు. బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి గురించి ఇలా వ్యాఖ్యలు చేయటంతో రైతులు రాజధానిని అమరావతి నుండి వేరే ప్రాంతానికి మార్చవద్దని నిరసనలు వ్యక్తం చేసారు. 
 
రాజధానిని అమరావతి నుండి దొనకొండకు మారుస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ప్రచారం జరుగుతూనే ఉంది. రాజధానిని మారుస్తారని ప్రచారం జరుగుతూ ఉండటంతో దొనకొండ ప్రాంతంలో భూముల ధరలు ఎకరం కోటి రుపాయలకు చేరిందని తెలుస్తోంది. వైసీపీకి చెందిన నాయకులు కొందరు దొనకొండ ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 
 
రాజధాని విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్య నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల గురించి సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజధాని విషయంలో రకరకాల వార్తలు రావటంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణపై విమర్శలు చేసారు. రాజధానిని అమరావతి నుండి మార్చటం మంచి పద్దతి కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: