దేశంలో ఎప్పుడు లేని విధంగా ఆర్ధిక వ్యవస్థ పెరుగుదల తగ్గిపోయింది. ఇప్పడూ జీడీపీ పెరుగుదల ఆరేళ్ళ కనిష్ఠానికి పడి పోయింది. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన విషయమే. భారత్ లాంటి దేశంలో జీడీపీ పెరుగుదల ఎప్పుడు కూడా 7 నుంచి 8 శాతం వరకు తగ్గినా దాఖలాలు లేవు. ఇదే విషయాన్ని జైలు నుంచి బయటికి వస్తున్న చిదంబరాన్ని అడిగితే సింపుల్ గా చేతిలో ఐదు ఏళ్లను చూపించి ప్రభుత్వం మీద ఛలోక్తులు విసిరారు. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే చిదంబరం ఎక్కడ ఉన్నా ప్రభుత్వం మీద విమర్శలు చేయడంలో అసలు తగ్గడం లేదని చెప్పాలి. 


అయితే ప్రస్తుతం చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. కోర్టులో ఇంకా వాదోపవాదనలు జరుగుతున్నాయి. అయితే ఈడీ నుంచి అరెస్ట్ ను తప్పించేందుకు చిదంబరం తరుపున లాయర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్ట్ తమ తీర్పును సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేసింది. దీనితో ఈడీ కేసులో బెయిల్ వస్తుందా ... అని చెప్పాలంటే చిదంబరం 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ఇంకొక పక్క సీబీఐ కేసులో చిదంబరంకు ఉపశమనం కలగలేదు. అయితే చిదంబరం .. కోర్ట్ ముందు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


ఇంట్రాగేషన్ పేరుతో తనను అవమానిస్తున్నారని తాను ఇంట్రాగేషన్ కు సహకరించడం లేదని .. ఈడీ తప్పుడు సమాధానాలు చెబుతుందని వాపోయారు. అయితే చిదంబరంకు ఇప్పుడు అసలైన భాద తెలుస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ప్రత్యర్థులను వేధించి జైలుకు తరలించారు. పాపం అప్పుడు చిదంబరంకు ఆ భాద తెలియలేదు. ఇప్పుడు రాజకీయ కక్ష అని .. నన్ను కావాలనే వేధిస్తున్నారని వాపోతున్నారు. అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు ..  చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: