దమ్ముంటే తనపై దాడి చేయాలంటూ చంద్రబాబునాయుడు వైసిపిని రెచ్చ గొడుతున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎలాగైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలన్నది చంద్రబాబు ఆలోచనగా అర్ధమవుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 469 అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తన హయంలో వైసిపి నేతలపై టిడిపి నేతలు చేసిన అరాచకాలను చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అప్పుడు అరాచకాలకు పాల్పడిన వారిపై యాక్షన్ తీసుకునుంటే ఇపుడు చర్యలు తీసుకోమని డిమాండ్ చేసే రైట్ ఉండేది.

 

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ గొడవలు జరిగిన మాట వాస్తవం. అయితే జరిగిన గొడవల్లో టిడిపి, వైసిపి నేతల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల మూలంగా జరిగినవే ఎక్కువ. అధికారంలో ఉన్నపుడు టిడిపి నేతలు చేసిన అరాచకాలకు మండిపోయిన వైసిపి నేతలు అధికారంలోకి రాగానే దాడులు జరిపుండచ్చు. అంతేకానీ అదే పనిగా టార్గెట్లు ఫిక్స్ చేసుకుని దాడులు చేసింది తక్కువనే చెప్పాలి.

 

మాజీ ఎంఎల్ఏలపై కేసులు పెడుతున్నారని, నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేయటం పూర్తిగా నిజంకాదు. ఫ్యాక్షన్ జిల్లాలుగా ముద్రపడిన అనంతపురం, కర్నూలు, కడపలో ఏ పార్టీ నేతలైనా  పద్దతి ఒకేలాగుంటుంది. అధికారంలో ఉన్న పార్టీ నేతలదే ఆ జిల్లాల్లో పై చేయిగా ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

 

చంద్రబాబు హయాంలో వైసిపి నేతలపై టిడిపి నేతలు ఎన్ని చోట్ల దాడులు చేసింది అందరికీ గుర్తుండే ఉంటుంది. అనంతపురం ఎంఆర్వో ఆఫీసుకు పిలిపించి మరీ ఓ వైసిపి నేతను హత్య చేశారు. కర్నూలు జిల్లాలో చెఱుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే టిడిపి అరాచకాలు చాలానే ఉన్నాయి. కళ్ళ ముందు టిడిపి నేతల అరాచకాలు కనబడుతున్నా కావాలనే చంద్రబాబు వైసిపిని రెచ్చ గొడుతున్నట్లే ఉంది. చూడబోతే రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లే ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: