శృంగారం అన్నది ఓ దృశ్యకావ్యం లాంటిది.  దాన్ని ఓ శాస్త్రీయ పద్దతిలో అద్భుతమైన రీతిలో చేస్తేనే దానికి అందం చందం.  ఆరోగ్యం కూడా.  కానీ, ఇప్పటి వ్యక్తులకు అన్ని తొందరే.  ఆ తొందరలో ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఆలోచించే సమయం ఉండటం లేదు.  ఎదో మొక్కుబడిగా చేసుకుంటూ వెళ్తున్నారు.  మొక్కుబడిగా చేయడానికి అదేమీ ఆఫీస్ డ్యూటీ కాదు.  శరీరానికి మనసుకు సంబంధించిన అంశం.  


శృంగారం అనే విషయం ఎత్తగానే అందరు షాక్ అవుతుంటారు.  ఆ మాట ఎత్తకండి.. నాకు ఆ మాటంటే ఇష్టం ఉండదు.. అసలు నాకు ఆ విషయాల గురించి ఆలోచించే సమయం లేదు అని అంటుంటారు.  సమయం సందర్భం అనే విషయాలు పక్కన పెడితే.. ప్రతి మనిషి కనీసం వారంలో రెండు మూడుసార్లు శృంగారంలో పాల్గొనాలి.  లేదంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.  


రీసెంట్ స్టడీస్ ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. 
కానీ, మనిషి మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.  చాలామంది శృంగారాన్ని సినిమాల్లో చూసి చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.  పోర్న్ సినిమాల్లో ఎలా చేస్తున్నారో చూసి దానికి అనుగుణంగా చేయడానికి రెడీ అవుతుంటారు.  రెచ్చిపోయి బెడ్ మీద దబిడిదిబిడి అంటూ రెచ్చిపోవాలని చూస్తారు.  తీరా ప్రాక్టికల్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఢమాల్ అనేస్తారు.  కారణం ఏంటి అంటే.. సినిమాల్లో నటించే వ్యక్తులు ట్రైనింగ్ తీసుకుంటారు.  


సినిమాను ఎడిటింగ్ చేస్తారు.. చాలా టేకులు ఉంటాయి.  ఒక పోర్న్ సినిమా చేయానికి చాలా సమయం పడుతుంది. సో, సినిమాల్లో చూపించారు కదా అని రియల్ గా ఫాలో కావాలని చూస్తే మాత్రం అనవసరంగా చేతులు కాళ్ళు విరగ్గొట్టుకోవాల్సి వస్తుంది.  శృంగారానికి పూర్తిగా దూరం కావాల్సి ఉంటుంది.  ఎప్పుడు కూడా శృంగారాన్ని శృంగారంగా భావించి దాన్నిఅనుభవించాలి తప్పించి ఫైటర్ లా రెచ్చిపోకూడదని ఇటీవల పరిశోధనలో తేలింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: