అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయో కర్ణాటకకు చూస్తే అర్ధం అవుతుంది. పదవుల కోసం .. పవర్ కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు అక్కడి నాయకులూ. అయితే కర్ణాటకలో రాజకీయాలు ఏ రాష్ట్రంలో మలుపు తిరగలేనతంగా తిరుగుతాయి. మొన్నటి వరకు నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ — జేడీస్ సర్కార్ కూలిపోయింది. దానితో అవిశ్వాసం తీర్మానంలో యడ్యూరప్ప సర్కార్ కొలువు దీరింది. అయితే యడ్యూరప్ప సర్కార్ కొలువు తీరి ఇప్పటికే నెల రోజులు దాటిపోతున్న పూర్తి కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొన్ని ఖాళీలు అలానే ఉన్నాయి. దీనితో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే.


ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వానికి పట్టిన గతి తమకు కూడా పడుతుందని బీజేపీ ఇప్పుడు భయపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఇంకా పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. కొంత మంది అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తుంది. 


ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది.  అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. యితే తాజగా సిద్దరామయ్య మరి కొన్ని రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీలో అసమ్మతి సెగలు ఎక్కువగా ఉన్నాయని సిద్దు ఉద్దేశం !


మరింత సమాచారం తెలుసుకోండి: