తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడుగా ఉన్న లోకేష్ పార్టీని అభివ్రుధ్ధి చేయడం మాట దేముడెరుగు, ఉన్న పార్టీని సవ్యంగా నడిపితే చాలన్న మాట అంతటా వినిపిస్తోంది. లోకేష్ పార్టీ పగ్గాలు అందుకోవాలనుకుంటున్నారు. అదే సమయంలో భావి ముఖ్యమంత్రిగా కూడా ప్రచారంలోకి వచ్చారు. ఎపుడైతే ఆయన్ని మంత్రిని చేసి కీలకం చేశారో నాటి నుంచే టీడీపీ గ్రాఫ్ బాగా పడిపోయిందన్న విమర్శలు వచ్చాయి. తాజా ఓటమి వెనక కూడా లోకేష్ ప్రభావం ఉందన్న మాట వినిపిస్తోంది.


ఇక తెలుగుదేశం పార్టీలో నంబర్ టూ గా ఉన్న లోకేష్ తాను స్వయంగా మంగళగిరిలో ఓటమిపాలు అయ్యారు. దాంతో ఆయన మీద ఉన్న అసంత్రుప్తి అంతా బయటకు వచ్చింది. ముఖ్యంగా కాపునాయకులు టీడీపీలోనే లోకేష్ కి వ్యతిరేకంగా గొంతు వినిపించారు. లోకేష్ వల్లనే పార్టీ ఓటమి పాలు అయిందని కూడా వారు ఆరోపించారు. ఇక లోకేష్ మూడు నెలల పాటు మౌనంగా ఉండీ ఇపుడే జనంలోకి వస్తున్నారు.


ఆయన తొలిపర్యటనగా విశాఖను ఎంచుకున్నారు. ఈ రోజు ఆయన విశాఖలో ఇలా అడుగుపెట్టారో లేదో సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయ్యన్నపాత్రుడు సోదరుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పదిమంది టీడీపీ మాజీ కౌన్లిలర్లు కూడా గుడ్ బై కొట్టేసారు. టీడీపీలో తగిన విలువ గౌరవం లేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా సన్యాసిపాత్రుడు చెప్పారు.


ఇదిలా ఉండగా వారంతా వైసీపీ వైపు చూస్తునట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఇప్పటికే రూరల్ జిల్లాలో బలమైన విశాఖ డైరీ కుటుంబం వైసీపీలో చేరిపోయింది. ఇపుడు మరోబలమైన నాయకుడు, స్వయానా మాజీ మంత్రి సోదరుడు అయిన సన్యాసిపాత్రుడు తన వర్గంలో టీడీపీకి గుడ్ బై కొట్టడం అంటే దారుణమే అంటున్నారు. చినబాబు ఇలా విశాఖలో అడుగుపెట్టారో లేదో అలా టీడీపీ మీద పిడుపు పడిందని కూడా సెటైర్లు వైసీపీ నుంచి పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: