అవినీతిని బయటపెట్టటానికి తాను అనుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. పోలవరం రివర్స్ టెండర్ల విధానంలోనే ముందుకెళ్ళాలని క్యాబినెట్ డిసైడ్ చేయటం సంచలనంగా మారింది. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం అందరకీ తెలిసిందే.

 

జరిగిన అవినీతి బయటకు రావాలంటే రివర్స్ టెండరింగ్ విధానమే సరైన దారిగా జగన్ అనుకున్నారు. అనుకున్నట్లే పోలవరం ప్రాజెక్టుతో పాటు హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టులు రద్దు చేశారు. ఎప్పుడైతే కాంట్రాక్టులు రద్దయ్యాయో వెంటనే రివర్స్ టెండర్లను కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సరిగ్గా ఇక్కడే కేంద్రప్రభుత్వం జగన్ ప్రయత్నాలకు మోకాలడ్డింది.

 

కాంట్రాక్టుల రద్దుపై ముందుగానే కేంద్రం హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదు. కాంట్రాక్టులు రద్దు కాగానే కాంట్రాక్టు సంస్ధ నవయుగ కోర్టును ఆశ్రయించటంతో స్టే వచ్చింది. అంటే రివర్స్ టెండర్ విధానంపై ముందుకు వెళ్ళవద్దని జగన్ ను కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే జగన్ నిర్ణయంపై అందరిలోను ఉత్కంఠ మొదలైంది.

 

కోర్టు చెప్పినట్లుగా రివర్స్ టెండర్ విధానాన్ని ఆపేస్తారా ? లేకపోతే స్టే వెకేట్ చేయించి మళ్ళీ ముందుకే వెళతారా ? అన్న విషయమై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపధ్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం కాంట్రాక్టు రద్దు, రివర్స్ టెండరింగ్ విధానంపై సుదీర్ఘంగా చర్చించిన సమావేశం చివరకు రివర్స్ పై ముందుకెళ్ళాలనే నిర్ణయించింది.

 

దాంతో కేంద్రం చెప్పినా, కోర్టు వద్దన్నా జగన్ మాత్రం తాను అనుకున్నట్లు రివర్స్ పై ముందుకే వెళ్ళాలని డిసైడ్ అయిన విషయం స్పష్టమైపోయింది. మరి ఇపుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. రివర్స్ పై ముందు కేంద్రం వద్దన్నా చివరకు జగన్ వాదనతో ఏకీభవిస్తున్నట్లే  అర్ధమవుతోంది. అలాగే ఇపుడు కోర్టును కూడా జగన్ కన్వీన్స్ చేస్తారేమో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: