గుంటూరు జిల్లాలో కోడెల బాధితుల శిభిరం ఏర్పాటుపై తీవ్రస్ధాయిలో చర్చ నడుస్తోంది. ఈ ఆలోచనకు చంద్రబాబునాయుడు వైఖరే భీజం వేయటం ఆశ్చర్యంగా ఉంది. జిల్లాలో వైసిపి బాధితుల శిభిరం పెట్టిన చంద్రబాబునాయుడు మరి కోడెల బాధితుల శిభిరం మాత్రం ఎందుకు పెట్టరు ? అంటూ మామూలు జనాలతో పాటు టిడిపిలోని బాధితులు కూడా చర్చించుకుంటున్నారు.

 

జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన దగ్గర నుండి టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన జిల్లాల కన్నా గుంటూరు జిల్లాలో వైసిపి బాధితులు ఎక్కువమంది ఉన్నారంటూ టిడిపి ఆధ్వర్యంలో ఓ శిభిరం ఏర్పాటు చేశారు చంద్రబాబు. నిజంగానే వైసిపి బాధితులు అంతమందున్నారో ? లేకపోతే రాజకీయంగా బురద చల్లేందుకే చంద్రబాబు శిభిరం అంటూ హడావుడి చేస్తున్నారో అర్ధం కావటం లేదు.

 

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఎప్పుడైతే వైసిపి బాధితుల శిభిరం అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారో వెంటనే కోడెల బాధితుల శిభిరం అంటూ మరో చర్చ మొదలైంది. నిజానికి చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు కుటుంబం చేయని అరాచకాలు లేవు. స్పీకర్ గా ఉన్న ఐదేళ్ళ కాలంలో కోడెలతో పాటు కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి అరాచకాలకు అంతు లేకుండా పోయింది.

 

బాధితుల్లో మామూలు జనాలే కాకుండా  టిడిపి నేతలు కూడా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కోడెల ద్వారా ఏ పని కావాలన్నా ట్యాక్స్ కట్టాలంటూ పార్టీలోనే ప్రచారం పెరిగిపోయింది. చివరకు ఆ వసూళ్ళనే  టిడిపి నేతలు ’కే ట్యాక్స్’  అంటూ ప్రచారంలోకి తెచ్చారు. ఆ విషయమే చంద్రబాబుకు కూడా తెలుసు. అదే విషయం జిల్లాతో పాటు రాష్ట్రమంతా ప్రచారమైంది. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాతే కే ట్యాక్స్ ఏ స్ధాయిలో ఉందో ఒక్కో విషయం బయటపడుతోంది. అందుకే కోడెల బాధితులతో ఓ శిభిరం పెట్టాలంటూ చర్చ మొదలైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: