ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వార్ జరగకపోయినా.. పాక్ తన మాటలతో యుద్ధం చేస్తున్నంత హడావుడి చేస్తున్నది.  ఈహడావుడితో యుద్ధం వస్తుందేమో అనిపించే విధంగా చేస్తున్నది.  వాస్తవానికి పాకిస్తాన్ కు అంత సీన్ లేదు.  యుద్ధం చేసే సత్తా ఆ దేశానికి లేదు.  ఒకవేళ యుద్ధం చేస్తే తీవ్రంగా నష్టపోతోంది పాక్.  ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నది.  నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతున్నాయి.  ఫార్మా పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది.  


చాలా రకాల మందులను పాక్ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటుంది.  ఇండియాలో ఆ మందులు చౌకగా దొరుకుతాయి.  అందుకే ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుంది.  ఒకవేళ యుద్ధం అనివార్యమైతే.. పాక్ కు ఆ మందుల సరఫరా ఆగిపోతుంది.  ఫలితంగా పాక్ డీలా పడుతుంది.  ఇప్పుడు పాక్ ముందున్న సమస్య యుద్ధం చేయకుండా ఉండాలి.  పాక్ యుద్ధం చేయకుండా ఉంటుందా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి.  ఎందుకంటే అక్కడి అధికారం సైన్యం చేతుల్లో ఉంటుంది.  వారికి దూకుడు ఎక్కవ.  


పొరపాటున యుద్ధం చేస్తే దానివలన వచ్చే తలనొప్పులు భరించాల్సి వచ్చేది ప్రధాని ఇమ్రాన్ ఖాన్.  ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్ కూడా ఉన్నది.  అందరికంటే ఎక్కువ అణ్వాయుధాలు రష్యా దగ్గర ఉన్నాయి.  ఆ తరువాత స్థానంలో అమెరికా ఉన్నది.  ఆ తరువాత ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, పాకిస్తాన్, ఇండియా దేశాలు ఉన్నాయి.  ఇండియా కంటే ఎక్కువ అణ్వాయుధాలు పాక్ దగ్గర ఉన్నాయి అన్నది వాస్తవం.  


పాక్ దగ్గర ఉన్న బాలిస్టిక్ రేంజ్ మిస్సైల్స్ తో అండమాన్ దీవుల వరకు గురిపెట్టగలదు.  కానీ, వాటిని ప్రయోగించడం చాలా కష్టం.  ఒకవేళ పాక్ అణుయుద్ధానికి దిగితే.. పాక్ అణ్వాయుధాలను దాచి ఉంచిన 9 స్థావరాలను ఇండియా టార్గెట్ చేస్తుంది.  పాక్ ఎక్కడెక్కడ అణ్వాయుధాలు దాచిపెట్టిందో ఇప్పటికే బయటకు వచ్చింది.  1. ఆక్రో గారిసన్ (సింధ్) 2. గుజ్రాన్ వాలా గారిసన్ (పంజాబ్) 3. ఖుజ్ దార్ గారిసన్ (బలూచిస్థాన్) 4. మస్ రూర్ డిపో (కరాచీ) 5. నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ (ఫతేజంగ్) 6. పానో అకిల్ గారిసన (సింధ్) 7. సర్గోదా డిపో (పంజాబ్) 8. తార్బాలా (ఖైబర్ ఫక్తూన్ ఖ్వా) 9. వాహ్ ఆర్డనన్స్ ఫెసిలిటీ (పంజాబ్) ప్రాంతంలో పాక్ అణ్వాయుధాలను దాచింది.  వీటిని టార్గెట్ చేస్తే చాలు.. పాక్ దిగి వస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: