న‌వ‌యుగ‌. నిర్మాణ కంపెనీల్లో రారాజుగా వ‌ర్థిల్లుతున్న ఈ సంస్త‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉం ది. నాణ్య‌మైన ప‌నికి నిలువెత్తు ద‌ర్ఫ‌ణంగా విప‌క్ష నాయ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు పొందిన ఈ సంస్థ ఏపీలో ఇప్పుడు తిప్ప‌లు ప‌డుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించి నిర్దిష్ట‌మైన ప్ర‌మాణా ల‌ను పాటించ‌కుండానే టెండ‌ర్ల‌ను ద‌క్కించుకున్న ఈ సంస్థ‌కు ఇప్పుడు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నా యి. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ద‌క్కించుకున్న ప‌నుల విష‌యంలో న‌వ‌యుగ కొన్ని ప్ర‌మాణాల‌ను పాటించ‌లేదు. 


నామినేష‌న్ ప‌ద్ద‌తిపై ప‌నులు ద‌క్కించుకోవ‌డం మున్ముందు దెబ్బ కొడుతుంద‌ని తెలిసి కూడా బాబే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తార‌నే ధీమాతో చేసిన దూకుడు ప‌నులు ఇప్పుడు సంస్థ ప్ర‌తిష్ట‌కు కూడా మ‌చ్చ‌గా మారాయి. పోల‌వ‌రం హైడ‌ల్ విద్యుత్ ప‌నులను కూడా నామినేష‌న్ ప‌ద్ద‌తిలో ఈ సంస్థ ద‌క్కించుకుంది. అయితే, టెండ‌ర్ల‌ను పిల‌వ‌కుండానే బిడ్డింగ్ జ‌ర‌గ‌కుండానే ఒక సంస్థ‌కు భారీ ప‌నులు అప్ప‌గించ‌డం, ప్ర‌జ‌ల సొమ్మును దోచిపెట్ట‌డంలో ఏదో అక్ర‌మం జ‌రిగింద‌ని పేర్కొంటున్న జ‌గ‌న్ వీటిని రివ‌ర్స్ టెండ‌రింగ్ చేయ డం ద్వారా ప‌నులు కాన్సిల్ చేశారు. 


ఇప్ప‌టికే రాక్ క‌మ్ ఎర్త్ డ్యామ్ విష‌యంలో హైకోర్టును న‌వ‌యుగ ఆశ్ర‌యించింది. అయితే, దీనిని విడిచి పెట్టిన జ‌గ‌న్‌.. హైడెల్ ప‌వ‌ర్ ప‌నులను వెన‌క్కి తీసుకున్నారు. దీనికి సంబంధించి న‌వ‌యుగ తీసుకున్న మొత్తాన్ని కూడా ఆయ‌న రాబ‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన మ‌చిలీప‌ట్నం పోర్టు నిర్మాణ ప‌నుల నుంచి కూడా న‌వ‌యుగ కు షాక్ త‌గిలింది. ఈ ప‌నుల‌ను కూడా న‌వ‌యుగ నుంచి త‌ప్పించాల‌ని జ‌గ‌న్ నేతృత్వంలో బుధ‌వారం భేటీ అయిన కేబినెట్ మంత్రులు నిర్ణ‌యం తీసుకున్నారు. 


ఈ విష‌యంలో ఎలాంటి వెనుక‌డుగు వేయరా ద‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. ఈ ప‌నుల‌కు సంబంధించి బాబు ప్ర‌భుత్వం కేటాయించి 412 ఎక‌రాల భూమిని కూడా వెన‌క్కి తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ ప‌రిణామంతో న‌వ‌యుగ కు దెబ్బ‌మీద దెబ్బ త‌ప్ప‌డం లేద‌ని అంటున్నారు ఈ నేప‌థ్యంలో ఇక ఈ సంస్థ‌ రాష్ట్రం నుంచి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఏదేమైనా..చంద్ర‌బాబును న‌మ్మి.. గుడ్డిగా ప‌నులు చేప‌ట్టిన సంస్థ ఇప్పుడు చిక్కుల్లో ప‌డింద‌నే వ్యాఖ్య‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: