ఈరోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ రద్దు కొరకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 3216 కోట్ల రుపాయల టెండర్ రద్దుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ ద్వారా తాజా టెండర్లకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధం మరో సంవత్సరం పాటు పొడిగించటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్ రికవరీకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. ఆశా వర్కర్లకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల జీతాల పెంపుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆశా వర్కర్ల జీతాలు మూడు వేల రుపాయల నుండి 10 వేల రుపాయలకు పెరిగాయి. పెరిగిన జీతాలు ఈ నెల నుండి అమలవుతాయని తెలుస్తోంది. 
 
మచిలీపటం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ కొరకు కేటాయించిన 412.50 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలనే నిర్ణయానికి కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ సకాలంలో పనులు ప్రారంభించకపోవటం వలనే కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. పరిశ్రమల శాఖ అధికారులు మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన భూముల లీజు కూడా చెల్లించలేదని కేబినేట్ కు తెలిపారు. 
 
కేబినేట్లో కొత్త ఇసుక విధానం గురించి, ఇసుక రీచ్ ల గురించి కూడా చర్చ జరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం గురించి కూడా కేబినేట్లో కమిటీ అందించిన నివేదికపై కూడా కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఏపీ కేబినేట్ ఈరోజు తీసుకున్న నిర్ణయంతో ఆశావర్కర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతూ ఉండటంపై ఆర్టీసీ ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: