పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు త‌త్వం బోధ‌ప‌డింది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం గత నెలలో భారతదేశంతో వాణిజ్యంపై గతంలో నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై కాలుదువ్వుతున్న ఇమ్రాన్‌కు దేశఃలో ఎదుర‌వుతున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో...ఇమ్రాన్ దారికి వ‌స్తున్నాడు. వాణిజ్య ర‌ద్దు విష‌యంలో పాక్‌లో ఔషధాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నెలలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 


ఇమ్రాన్‌ఖాన్ సార‌థ్యంలోని పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి కేన్సర్, హృద్రోగాలకు సంబంధించిన ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఇమ్రాన్‌ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర ఔషధాల దిగుమతికి అనుమతిస్తూ పాక్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చట్టబద్దమైన ఉత్తర్వులు వెలువరించింది. గత 16 నెలల కాలంలో పాక్ భారతదేశం మిలియన్ డాలర్ల విలువ గల యాంటీ రాబీస్, యాంటీ వీనం వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది.


లాహోర్‌లోని గవర్నర్‌ హౌస్‌లో అంతర్జాతీయ సిక్కు సదస్సులో ఇమ్రాన్ ఖాన్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ భారత్‌తో యుద్ధాన్ని ప్రారంభించబోదని ఆ దేశ పేర్కొన్నారు. ‘ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. యుద్ధం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయి’ అని పేర్కొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో.. భారత్‌, పాక్‌ మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగితే ప్రపంచానికే నష్టం అని ఇటీవల ఇమ్రాన్‌ఖాన్‌ తరచూ బెదిరింపులకు దిగడం తెలిసిందే. మరోవైపు, తమ దేశంలోని సిక్కు పుణ్యస్థలాలను సందర్శించే భారత, విదేశీ సిక్కు యాత్రికులకు బహుళ వీసాలు జారీ చేస్తామని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.


కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయంగా ఏకాకి అయిన పాకిస్థాన్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి వచ్చి పడింది. కశ్మీర్‌లో మారణహోమం జరుగుతున్నదని తమ దేశం చెబుతున్నదని, ఈ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో నిరూపించడం చాలా కష్టమని ఐసీజేలో పాక్‌ తరఫు న్యాయవాది ఖావర్‌ ఖురేషి చెప్పారు. ఈ విషయాన్ని నిరూపించాలంటే బలమైన ఆధారాలు ఉండాలని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: