చీమ మీద ఎన్టీఆర్ సాంగ్ పాడాడు.. ఈగతో రాజమౌళి ఏకంగా సినిమా తీశాడు.  రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  అలానే రోబో సినిమాలో ఐష్ ను కుట్టిన దోమను పట్టుకోవడానికి చిట్టి రోబో హంగామా చేస్తుంది.  చివరకు దోమను పట్టుకుంటుంది. ఈ సినిమా బంపర్ హిట్టైంది.  చీమ, దోమ, ఈగ తో సినిమా సినిమాలు హిట్ అయ్యాయి.  ఇప్పుడు దోమ ఏకంగా గూఢచర్యం నిర్వహించి ఓ భారీ రహస్యాన్ని ఛేదించింది.  వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు.  కానీ, ఇది నిజం.  


పాకిస్తాన్ గత కొంతకాలంగా అణ్వాయుధాలను తయారు చేస్తున్నది.  అదీ పావుకిలో బాంబులు.  తక్కువ దూరంలో తక్కువ లక్ష్యాలను ఛేదించడానికి ఈ రకమైన బాంబులను తయారు చేస్తున్నది.  తక్కువ బరువులో ఉండే బాంబులను తయారు చేసుకునే టెక్నాలజీ పాకిస్తాన్ వద్ద లేదు.  అణుబాంబులు సంబంధించిన టెక్నాలజీని చైనా వద్ద నుంచి తీసుకుంటోందని గతంలో ఇండియా వాదనలు చేసింది.  


కానీ, పాకిస్తాన్ మాత్రం వాటిని తిప్పికోట్టింది.  తమ దగ్గర టెక్నాలజీ ఉందని, తామే సొంతంగా అణుబాంబులను  తయారు చేసుకుంటున్నామని చెప్పింది.  ఇన్నాళ్లు అలానే చెప్తూ వస్తున్నా ఎట్టకేలకు.. అసలు విషయం బయటపడింది.  కరాచీలోని హాకీస్ బేలో పాక్ అణు రియాక్టర్ ఉన్నది.  అక్కడే పాక్ అణుబాంబులను తయారు చేస్తున్నట్టు సమాచారం.  కాగా, ఇందులో చైనాకు చెందిన 200 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు.  వీరందరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.  


వీరందరిని సురక్షిత ప్రాంతంలో ఉంచి అక్కడి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య చికిత్సలు అందిస్తున్నది.  200 మంది చైనా ఇంజనీర్లు డెంగ్యూ బారిన పడ్డారని, పాక్ పత్రిక తెలిజేసిన సంగతి తెలిసిందే.  దీనిని అక్కడి వైద్య ఆరోగ్యశాఖ కూడా ధృవీకరించింది.  200 మంది ఇంజనీర్లు పాక్ లో ఎం చేస్తున్నారు.. అణురియాక్టర్ లో వీరు చేస్తున్నది ఏంటి అనే విషయం అందరికి అర్ధం అవుతుంది. చైనా సహాయంతోనే పాకిస్తాన్ అణుబాంబులను తయారు చేస్తుందని దీనిని బట్టి తెలుసుకోవచ్చు.  ఒక చిన్న దోమ పెద్ద రహస్యాన్ని ఛేదించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: