రాజకీయం కక్షణానికోక రంగు పులుముకుంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంటే ప్రాణం ఇస్తారు..అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఇక ప్రస్తుత విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్ ని రెండుగా విభజించిన కారణంగా  కాంగ్రెస్ అటు తెలంగాణ..ఇటు ఏపీలో నామరూపాలు లేకుండా పోయింది. దీనితో2014 లో జరిగిన ఎన్నికలలో వైసీపీ టీడీపీ పోటీ పడగా..నాకున్న  అనుభవం చూసి నాకు ఓటు వేయండి..అభివృద్ధి లో పరుగులుపెట్టిస్తా నంటూ చంద్రబాబు అధికారంలోకి వస్తే... 2019 ఎన్నికల్లో నాకు ఒక ఛాన్స్ అంటూ కధన రంగంలోకి దూకిన జగన్ ని ఏపీ ప్రజలు . మునుపెన్నడూ రానటువంటి భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించారు.దీన్ని బట్టి చూస్తే..రాజకీయం లో అధికారం అనేది శాశ్వతం కాదు అని అర్థం చేసుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన వారు ఇక ఇక మేమే అధికారంలో ఉంటాం అంటూ గొప్పలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇకపోతే రాజకీయాలలో వలసలు అనేవి సర్వ సాధారణం . పదవుల కోసం అటు నుండి ఇటు ..ఇటు నుండి అటు జంప్ అవుతూ ఉంటారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ గెలిచిన తరువాత వైసీపీ లో నుండో ఏకంగా 23 మంది టీడీపీ లోకి వెళ్లిపోయారు. దీనిపై ఆ నాటి ప్రతిపక్షం పెద్ద రచ్చ చేసింది. ఇక అది అలా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ లో ఎన్నికలు రావడం... వైసీపీ ఘనవిజయం సాధించడం జరిగిపోయింది. అలాగే టీడీపీ కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం కావడం మరో ముఖ్యమైన విషయం. దీనితో టీడీపీ పూర్తి నిరాశ లో కూరుకుపోయింది. ఈ సమయంలోనే టీడీపీ నేతలు చిన్నగా గోడ దూకడం మొదలుపెట్టారు.కొందరు బీజేపీలో చేరిపోగా..మరి కొందరు మాత్రం వైసీపీ లో చేరిపోతున్నారు. ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీలో చేరడం అనేది చాలా  కామన్ విషయం....కానీ, తాజాగా వైసీపీ కి చెందిన కీలక నేత ఒకరు టీడీపీ లో చేరిపోయారు.

అసలు విషయానికొస్తే... విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి చెందిన మాజీ వైసిపి నాయకుడు సీవేరి దొన్ను దొర తెలుగుదేశం పార్టీలో చేరారు.. గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్ లు, చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. వారందరిని పార్టీ కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి కృషిచేసిన ఘనత టీడీపీదేనని చెప్పుకొచ్చారు. అలాగే దొర ప్రసంగిస్తూ, వైసిపి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి తన వంతు కృషి చేస్తామని అన్నారు. గత ఎన్నికలలో అరకు నుంచి వైసీపీ రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర రెండో స్థానంలో నిలిచారు.అధికారంలో ఉన్నా ..ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ లోకి వలసలు మాత్రం ఆగడంలేదు ..ఇదే మరి  అపర చాణిక్యుడు రాజకీయ అస్త్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: