బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభమబోతున్న తరుణంలో యాంక‌ర్ కం పొలిటిషీయ‌న్‌ శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పలు మీడియా ఛానెళ్లలో మాట్లాడిన శ్వేత.. తాను బిగ్ బాస్‌ సీజన్ 3కి ఎంపికైన తీరు, ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది వంటి విషయాలను క్షుణ్ణంగా వివరించారు. ధర్మపోరాటాలు చేసింది, దీక్షలు చేసింది, ధర్నాలు చేసింది, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాటమే చేసింది, ప్రెస్ మీట్లు పెట్టింది. తాజాగా తిరిగి రాజ‌కీయాల్లో చేరింది. 


ఆంద్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో శ్వేతారెడ్డి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. త‌న తండ్రి గజ్జల వాసుదేవరెడ్డితో క‌లిసి యాంకర్ శ్వేతారెడ్డి కాషాయ కండువా క‌ప్పుకొన్నారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా శ్వేతారెడ్డి వెల్ల‌డించారు.


బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ జరుగుతోందంటూ శ్వేతారెడ్డి షో ప్రారంభంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ షో నిర్వాహకులపై మాజీ యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 3 షోలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆమె హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే, అది బంజారా హిల్స్ పరిధిలోకి వస్తుందంటూ వారు సూచించడంతో ఆమె బంజారాహిల్స్‌కు వెళ్లారు.. బిగ్ బాస్ 3 ద్వారా ఉత్తరాది సంస్కృతిని తెలుగువారిపై రుద్దుతున్నారని ఆమె ఆరోపించారు. అనంత‌రం ఢిల్లీ వెళ్లి ఆందోళ‌న సైతం నిర్వ‌హించారు. 
ధర్మపోరాటాలు చేసింది, దీక్షలు చేసింది, ధర్నాలు చేసింది, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాటమే చేసింది, ప్రెస్ మీట్లు పెట్టి త‌మ ఆవేద‌న‌ను వినిపించారు.  ఢిల్లీ వేదిక‌గా త‌న‌కు జ‌రిగిన న్యాయం గురించి వివ‌రిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పట్టించుకోనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ న్యాయం జరుగక పోయినా ఢిల్లీ స్థాయిలో మనకు న్యాయం జరుగుతుంది అనే విషయం తేటతెల్లం అయిందని శ్వేతారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: