ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ ఇండియాపై ఒంటికాలితో లేస్తున్నది.  అవసరం అనుకుంటే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తోంది.  ఈ హెచ్చరింపులు బెదిరింపులకు ఇండియా భయపడుతుందా చెప్పండి.  ఎన్నో ఎదురు దెబ్బలు తిని ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగింది ఇండియా.  ఇప్పుడు ఈ ఎదుగుదలను చూసి చాలా దేశాలు కుళ్ళుకుంటున్నాయి.  


అందులో ఒకటి పాక్ కూడా.  కాశ్మీర్ అంశంలో వేలుపెట్టడానికి వీలు లేకుండా పోవడంతో ఇండియాపై విరుచుకుపడుతున్నది.  ఎలాగైనా కాశ్మీర్ ను దక్కించుకోవాలని అనుకున్న పాక్ కు ఇది చాలా పెద్ద షాక్ అని చెప్పాలి. ఇండియాపై అణుయుద్ధం చేస్తామని చెప్తున్న పాక్ పై ఆ దేశ ప్రజలు షాక్ ఇస్తున్నారు.  పెద్ద వాళ్ళ నుంచి చిన్న కుర్రాళ్ళ వరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న పనులపై విరుచుకుపడుతున్నారు. 

లాహోర్ కు చెందిన 17 సంవత్సరాల కుర్రోడు పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డాడు.  భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా సత్సంబంధాలు కలిగి ఉందని పాక్‌ ప్రజలు గుర్తించాలి. వాణిజ్య పరంగా భారత్‌ చాలా ప్రభావంతమైన దేశం. భారత్‌ స్థాయికి పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుగనంత వరకూ ఆ దేశంతో పోల్చుకోకూడదు. ఆర్థిక పరంగా ఇండియాను పాక్‌ ఢీకొట్టనంత వరకూ కశ్మీర్‌ అంశం పరిష్కారం కాదు. కాబట్టి ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. కశ్మీర్‌ అంశాన్ని పక్కన పెట్టి దేశం వైపు చూడాలి. ఇమ్రాన్‌ ఖాన్‌  పాకిస్తాన్‌ ప్రధాని అన్న విషయం గుర్తించుకుంటే మంచిది" అని హితవు పలికాడు.  


చిన్న కుర్రోడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దేశం పట్ల నిబద్దత ఉండాలని, దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేసినపుడు ఎలాగైనా ప్రవర్తించవచ్చని, అసలే దేశం ఆర్ధికంగా కుంగిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో యుద్ధం అంటూ రాద్ధాంతం చేస్తూ కూర్చుంటే.. పాక్ చివరకి దివాళా తీసే పరిస్థితికి వస్తుందని ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు.  తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్న రీతిలో పాక్ ప్రవర్తిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: