ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో పాటు కామెడీ కూడా బాగానే చేస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకున్న ఆ పార్టీని అనేక మంది నేతలు వీడిన విషయం తెలిసిందే. చాలామంది బీజేపీలోకి పోతే, కొందరు వైసీపీలోకి వెళుతున్నారు. అలాగే మరికొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ లోకి ఓ వైసీపీ రెబల్ నేత చేరడంతో సంబరాలు చేసుకుంటున్నారు.


మొన్న ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన వైసీపీ రెబల్ అభ్యర్ధి దొన్ను దొర సియ్యరి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక్కడ చెప్పాల్సిన మరో విశేషం ఏమిటంటే అరకు నుంచి టీడీపీ తరుపున మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ పోటీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన చెట్టి ఫాల్గుణ 53 వేలు ఓట్లు తెచ్చుకుంటే, వైసీపీ రెబల్ అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర 27 వేలు ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచారు. 


ఇక శ్రవణ్ కేవలం 20 వేలు ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కూడా కోల్పోయారు. అయితే దొన్ను దొర మళ్ళీ వైసీపీలోకి వెళ్లలేక రాజకీయ పునరావాసం కోసమని టీడీపీలో చేరారు. ఇక దీనికే టీడీపీ అధిష్టానం, నేతలు సంబరాలు చేసేసుకుంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకిత వచ్చేసిందని తమ పార్టీ బలపడిపోతుందని గొప్పలు చెప్పుకుంటున్నారు. రెబల్ నేత చేరికతోనే రచ్చ చేస్తున్నారు. 


టీడీపీలో ఈ పరిణామాలని చూస్తుంటే ఫుల్ కామెడీగా అనిపిస్తోంది. ఒకవైపు బడా నేతలంతా రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్ లేదని భావిస్తూ బీజేపీ, వైసీపీల్లోకి వెళుతుంటే టీడీపీ మాత్రం మా పార్టీలో కూడా ఒక నాయకుడు చేరాడని కామెడీ చేస్తోంది. మొత్తం మీద టీడీపీ పరిస్థితి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: