దేశంలో కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత పాపం వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  ఇబ్బందులు వస్తాయనే గాని, చట్టాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి.  అందు కోసమే చట్టాలను కఠినం చేస్తున్నారు. లేదంటే చట్టాలను అందరు చుట్టలుగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.  అందుకోసమే మోడీ ప్రభుత్వం చట్టాలను కఠినం చేసింది.  


కొత్త వాహన చట్టం తీసుకురావడానికి కారణం కూడా ఇదే. కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి తీసుకొచ్చి పొల్యూషన్ కు కారణం అవుతున్నారు.  పొల్యూషన్ వలన వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. పొల్యూషన్ తగ్గించాలని, లేదంటే మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుందని ఇప్పటికే అనేక సంస్థలు నెత్తినోరు బాదుకుంటున్నాయి.  కానీ, ఎవరూ వినడం లేదు.  


అందుకే చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది.  మాములు చలానా ప్లేస్ లో భారీ చలానా తీసుకొచ్చింది.  భారీ స్థాయిలో చలనాలను తీసుకొస్తే.. తప్పుడు మార్గాల్లో వెళ్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది అనే సత్యం బోధపడుతుంది.  ఫలితంగా ఎవరు కూడా తప్పుడు మార్గాల్లో నడిచేందుకు సాహసం చేయరు.  కొత్త వాహన చట్టం అమలులోకి తెచ్చిన తరువాత చాలా చలానాలు వసూలు అయ్యాయి.  నిన్ననే రాజధాని నగరంలో ఓ వ్యక్తికీ 25 వేలరూపాయల ఫైన్ వేశారు.  


కట్టాల్సిందే.  బండి ఖరీదు 15వేలు అయితే.. ఇప్పుడు చలానాలు రూపంలో 25 వేలు కట్టమంటే ఎలాఅంటే.. కట్టకపోతే జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు.  ఇదిలా ఉంటె, తాజాగా ఓ ఆటో డ్రైవర్ కు భారీ చలన వేశారూ. దాదాపు 47వేల రూపాయల ఫైన్ వేసారట.  దీంతో ఆ ఆటో డ్రైవర్ షాక్ అయ్యాడు.  తన దగ్గర అంత డబ్బు లేదని, తనను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లాలని అంటున్నాడు. చలానా కట్టాలి అంటే తన ఆస్తులు అన్ని అమ్మినా సరిపోవని, ఈ కేసునుంచి రక్షించుకోవాలి అంటే జైలుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు పాపాం ఆ డ్రైవర్ కు. 


మరింత సమాచారం తెలుసుకోండి: