ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు నిన్న జరిగిన కేబినేట్ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు నుండి నూతన ఇసుక విధానం అమలులోకి రాబోతుంది. కేబినేట్ భేటీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి సంవత్సరానికి పది వేల రుపాయలు ఇవ్వటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
ఫిట్ నెస్, ఇన్స్యూరెన్స్, రిపేర్ల కోసం ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఈ సాయం అందించనున్నారు. దాదాపు 3 లక్షల 97 వేల మంది ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారు లబ్ధి పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారు సెప్టెంబర్ 10 వ తేదీ నుండి ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ధరఖాస్తు చేసిన ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఈ నెల 4 వ వారం నుండి ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. 
 
పెంచిన వైయస్సార్ పెళ్లి కానుకను శ్రీరామనవమి నుండి అమలు చేయాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ పెళ్లి కానుక పథకం కింద ఎస్సీలకు ఇచ్చే నగదు 40 వేల రుపాయల నుండి 1,00,000 రుపాయలకు పెంచారు. ఎస్టీలకు 50,000 రుపాయల నుండి 1,00000 రుపాయలు, బీసీలకు 35,000 రుపాయల నుండి 50,000 రుపాయలు, మైనార్టీలకు 50,000 రుపాయల నుండి 1,00,000 రుపాయలకు పెంచారు. 
 
ఆశా వర్కర్లకు జీతాన్ని 3,000 రుపాయల నుండి 10,000 రుపాయలకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రా బ్యాంకు పేరును అదే విధంగా ఉంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: