ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో పార్టీ తరపున తన వాయిస్ వినిపించిన సాధినేని యామిని ఎన్నికల తరువాత పార్టీకి దూరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో ఆమె మాటలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.  దీంతో ఆమెకు అనేక ఇబ్బందులు వచ్చాయి. బహుశా ఆమె పార్టీకి దూరంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు.  


ఎన్నికల తరువాత సడెన్ గా ఆమె కన్నా లక్ష్మినారాయణను కలిసింది.  మాట్లాడింది.  ఫోటోలు కూడా దిగింది.  కన్నా లక్ష్మీనారాయణతో ఫోటో దిగిన తరువాత ఆమె బీజేపీలోకి వెళ్తుందని వార్తలు వచ్చాయి.  ఈ వార్తలను ఆమె ఖండించింది.  తానూ బీజేపీలోకి వెళ్లడం లేదని, తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది.  బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  


అయితే, తెలుగుదేశం పార్టీతో దూరంగా ఎందుకు ఉంటున్నట్టు, బహుశా గతంలో ఆమెపై వచ్చిన ట్రోలింగ్ కు భయపడి దూరంగా ఉంటుందా లేదంటే ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే.. దానికి ఆమె చెప్తున్న సమాధానం భలే విచిత్రంగా ఉన్నది.  తన తండ్రి చనిపోవడం వలన రాజకీయాలకు దూరంగా ఉన్నానని, కొన్ని రోజుల క్రితం బాబును కలిసినట్టు యామిని చెప్పింది.  రాజకీయాలకు దూరంగా ఉండొద్దని, తిరిగి యాక్టివ్ కావాలని చెప్పారని సాదినేని యామిని చెప్పుకొచ్చింది.  


తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలహీన పడుతున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉండటం కంటే బీజేపీలో జాయిన్ అయితే మంచిది అనుకున్నదేమో అందుకే బహుశా పార్టీతో సంబంధాలను కొనసాగించడం తగ్గించింది.  ఎంతైనా బాబుగారి శిష్యురాలు కదా.. ఎక్కడ ఎలాంటి రాజకీయాలు నడపాలో ఆమెకు బాగాతెలుసు . తాను పార్టీ మారడంలేదు అంటూనే ఇతర పార్టీ నాయకులతో టచ్ లో ఉండటం వెనుక ఉద్దేశ్యం ఏంటో మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: