రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.  ఒకరోజు ఒకరికి మంచి జరిగితే మరొక రోజు మరొకరికి మంచి జరుగుతుంది.  మొత్తంగా చెప్పాలి అంటే.. మనం చేసే పనులను బట్టి మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి వస్తుంటాయి. 2014లో చంద్రబాబు రోజులు నడిచాయి.  ఐదేళ్లపాటు బాబు పాలన సాగింది.  అయన పాలనలో అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.  


అయితే, 2019 వరకు వచ్చే సరికి బాబు పాలన నుంచి వైకాపా పాలన మోడలింది.   జగన్ అధికారంలోకి వచ్చారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే దూకుడును ప్రదర్శించారు. ఆ దూకుడుతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.  జగన్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు బాబుకు ఇబ్బందికరంగా మారాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి బాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.  ముఖ్యంగా తన కేడర్ ను కాపాడుకోవడానికి బాబు పడుతున్న తాపత్రయం అంతాఇంతా కాదు.  


మాములుగా ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలోకి వలసలు వెళ్లడం అన్నది మామూలే.  గత ఎన్నికల్లో వైకాపా 151 స్థానాల్లో విజయం సాధించింది.  ఈ స్థాయిలో స్థానాలు గెలుచుకోవడం అన్నది చాలా కష్టమైనా విషయమే.  బాబుగారికి కేవలం 23 స్థానాలు మాత్రమే ఇచ్చారు.  ఈ స్థాయిలో టిడిపి ఎప్పుడు ఓటమి చెందలేదు.  ఇలా జరగడం ఇదే మొదటిసారి.  ఇక ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నేతలు వైకాపా, బీజేపీ వైపుకు వెళ్లారు.  మాజీలు ఎక్కువ మంది బీజేపీలోకి జంప్ అయ్యాడు.  


అయితే, ఎన్నికలు జరిగిన తరువాత మొదటిసారి వైకాపాకు చెందిన నేత దొన్ను దొరై తెలుగుదేశం పార్టీలో చేరారు.  అధికార పార్టీ నుంచి ఒక సీనియర్ నేత ఇలా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో చేరడం ఒక గొప్ప విషయంగానే చెప్పాలి.  ఈ నేత గత ఎన్నికలో అరకు నుంచి సీటు ఆశించగా అందుకు వైకాపా సమ్మతించలేదు. దీంతో అయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు.  ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: