ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అయిన టీడీపీ .. ఉద్యోగులను మభ్య పెట్టి చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు వారిని పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదనపు ఆర్ధిక భారం పడుతుందని బాబు భావించి ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దాలుగా ఏ సీఎం తీసుకోని నిర్ణయం జగన్ తీసుకోవటంతో అందరూ జై జగన్ అంటూ మీడియ ముందు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


ఇదొక్క నిర్ణయం చాలు .. ప్రజల సమస్యల పట్ల జగన్ ఎంత చిత్త శుద్దితో పనిచేస్తున్నారని ! తన తండ్రి రాజన్న పాలనను గుర్తుకు తెస్తున్నారని .. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పరిపాలనను నడిపిస్తున్నారని . ఎవరు ఏది అడిగిన బోళా శంకరుడు మాదిరిగా హామీలు నెరవేర్చడం ఇవన్నీ జగన్ ప్రతిష్టను పది రెట్లు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. దీనితో టీడీపీ ఎక్కడ లేని ఆందోళనకు గురౌతుంది. టీడీపీ తీసుకులోని నిర్ణయం కేవలం మూడు నెలల్లో జగన్ తీసుకొని ఇటు ప్రజల మనసును గెలుచుకున్నారు .. అటు టీడీపీని కుదేలు చేశాడు . అయితే జగన్  సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు.


చాలా కీలక బిల్లులు అయిన ఉదాహరణకు వెనుకబడిన తరగతులకు నామినేటెడ్ పదవులకు 50 శాతం రిజర్వేషన్స్ అయితేనేం, అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కీలక సంస్కరణల కోసం కొత్త చట్టాన్ని తీసుకురావటం.. ఇవన్నీ పేద ప్రజలకు మేలు చేసేవి. అలాగే దేశంలో ఏ రాష్ట్రం భర్తీ చేయని విధంగా ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సుమారు 2 లక్షల 67 వేల ఉద్యోగాలు గ్రామీణ యువతకు అవకాశాలు కల్పించారు. ఇవే గాక ప్రభుత్వ ఉద్యోగాలు అయిన గ్రామ సచివాలయాలు సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు వదిలి ఔరా అనిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: