రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ వెంచర్ నుండి సింగపూర్ కంపెనీలు తప్పుకున్నాయా ? చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే ఎల్లోమీడియా కథనాలు చూస్తుంటే అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా చంద్రబాబు కలలు కన్న స్ధాయిలో అమరావతి నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న అన్నీ విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న సింగపూర్ కంపెనీల కన్షార్షియం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కథనంలో చెప్పింది.  సీడ్ క్యాపిటల్ ప్రాజెక్టు  నుండి  తాము తప్పుకుంటున్న విషయాన్ని ప్రభుత్వానికి చెప్పిందట.

 

నిజానికి ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో ఒకదానినిగా నిర్మించాలని చంద్రబాబు కలలు కన్నారు కానీ వాస్తవానికి జరిగే పనికాదు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో 35 వేల ఎకరాల పంట పొలాలను సమీకరించి రియల్ ఎస్టేట్ గా మార్చేశారు. నిజానికి చంద్రబాబు కలలు కన్నస్ధాయిలో రాజధాని అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని బట్టి ఎవరైనా మనం ఏ స్ధాయిలో తూగగలమని అంచనా వేసుకుంటారు. అలాంటిది చంద్రబాబు నేలవిడిచి సాము చేశారు. దాంతో ఎటూ కాకుండా చివరకు బోర్లా పడ్డారు.

 

సింగపూర్ కన్సార్షియంకు కూడా తెలుసు చంద్రబాబు కలలు కన్న రాజధాని నిర్మాణం సాధ్యంకాదని. దానికి తోడు ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురైన ఘోర పరాజయంతో కన్సార్షియంకు అర్ధమైపోయింది చంద్రబాబు రాజధాని నిర్మాణం సాధ్యం కాదని. దానికి తోడు క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా అంత ప్రోత్సాహకరంగా లేదు. అందుకనే స్వచ్చంధంగా సీడ్ క్యాపిటల్ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని నిర్ణయించింది.

 

నిజానికి జగన్ కు కావాల్సింది కూడా అదే. ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని జగన్ వాస్తవానికి తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నారు. అందుకనే సెక్రటేరియట్, అసెంబ్లీలను ఎంత అవసరమో అంతే కట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ ఆలోచనల ప్రకారం తమకు వర్కవుట్ కాదన్న ఉద్దేశ్యంతోనే సింగపూర్ కన్సార్షియం సీడ్ క్యాపిటల్ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు చెప్పేసిందని ఎల్లోమీడియా కథనం ఇచ్చింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: