మనవులు నిత్యం తీసుకునే మందులు మానవుల శరీరంపై రకరకాలుగా ప్రభావం చూపుతుంటాయి. కొన్ని మందుల వలన వ్యాధి నయం అయినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మధుమేహానికి ఉపయోగించే మందుతో మనిషి యొక్క ఆయుష్షు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తెలిసింది. మధుమేహం వ్యాధి వచ్చినవారు మెట్ ఫార్మిన్ అనే మందును ఎక్కువగా ఉపయోగిస్తారు. 
 
మెట్ ఫార్మిన్ మందును ఉపయోగించటం ద్వారా మనిషి యొక్క ఆయుష్షు పెరిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మెట్ ఫార్మిన్ మందు వినియోగిస్తున్న మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో కేన్సర్ వ్యాధి తక్కువగా సోకుతూ ఉండటం, ఈ మందును వినియోగించిన వారి జీవిత కాలం పెరగటాన్ని శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో గుర్తించారు. మెట్ ఫార్మిన్ వలనే ఈ మార్పు జరిగిందని 2017లో జరిపిన ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలకు తెలిసింది. 
 
ఈ మందును జంతువులపై ప్రయోగించగా ఈ మందును ప్రయోగించిన జంతువుల్లో కూడా ఆయుష్షు పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ అందరిలో ఈ మందు వలన ఒకే రకమైన ఫలితాలు ఉంటాయా అనే ప్రశ్నకు మాత్రం శాస్త్రవేత్తలు ఫలితాలు వేరువేరుగా ఉంటాయని చెబుతున్నారు. కడుపులోని బ్యాక్టీరియా విడుదల చేసే ఆగ్మాటిన్ అనే రసాయనం మెట్ ఫార్మిన్ యొక్క పనితీరును ప్రభావితం చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మెట్ ఫార్మిన్ మందు పనితీరు గురించి మరిన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మెట్ ఫార్మిన్ తీసుకునే వారిలో ఈ కోలీ అనే బ్యాక్టీరియా ఉంటే నైట్రోజన్ తో కూడిన రసాయనాలు విడుదల అవుతాయని ఈ రసాయనాలు ఆరోగ్యం మెరుగుపరచటానికి కారణం అవుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. యేల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో  మందులపై పేగుల్లోని బ్యాక్టీరియా చూపుతున్న ప్రభావాల గురించి పరిశోధనలు జరుపుతున్నారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: