బార్ అంటే హంగులు ఆర్భాటాలతో నిండి వుంటుంది.డిస్కో లైట్ల వెలుగుల్లో పెద్ద పెద్ద చైర్స్ పై కూచోని పెగ్ వేస్తే వచ్చే కిక్కు డబ్బున్నోళ్లకు బాగా తెలుసు,ఎందుకంటే సామా న్యుడు వెళ్ళితే అక్కడేసే బిల్లుకు బీపి వస్తుంది కాబట్టి.ఇక పబ్‌లు,కాని బార్‌లు కాని పెద్ద పెద్ద అంతస్తుల్లో కడతారు.వాటి ముందు దర్పంగా నిలుచున్న సెక్యూరిటి,డ్రెస్ కోడు తో సిబ్బంది మనకు కనిపిస్తారు. ఒక్కో బార్‌ను కాని పబ్‌ను కాని బయటి నుండి చూస్తే లోనికి వెళ్లాలని మనసు తెగ తొందర పెడుతుంటుంది కాని వెళ్లలేం.ఐతే ఈ బార్‌ను చూస్తే మాత్రం లోనికి వెళ్లాలని అనిపించిన వెంటనే వెళ్ళిపోతాం.వీటన్నింటికి భిన్నంగా ఉన్న ఈ పబ్,బార్ గురించి తెలుసుకుందాం..




ఇదో ప్రత్యేకమైన బార్.సిమెంట్ గాని,ఇసుక గాని వాడకుండా నిర్మించిన బార్,అందుకే దీని గురించి అందరు ఆసక్తితో చెప్పు కుంటారు.ఇంతలా పొగుడుతున్న ఈ బార్‌ను ఓ చెట్టు తొర్రలో నిర్మించారు.ఏంటి చెవిలో పువ్వులు పెడుతున్నాఅనుకుంటు న్నారా,నేను చెప్పేది నిజమండి.దక్షిణ ఆఫ్రికాలో దాదాపు ఆరువేల సంవత్సరాల క్రితం నాటి వయసున్న బావొబాబ్‌ అనే చెట్టు ఒకటుంది.ఆ చెట్టు క్రమక్రమంగా డొల్లగా మారింది.ఇంకేముంది విభిన్నంగా ఆలోచించే ఓ వ్యక్తి కళ్లల్లో ఆ చెట్టుపడ్డది.ఇక ఊరు కుంటాడా తన ఆలోచనలకు పదును పెట్టి,వెంటనే ఆ తొర్రలో ఏకంగా ఓ పబ్‌,బార్‌ నిర్మించాడు.అతనికి వచ్చిన ఆలోచనకు ఆశ్చర్యపోయిన వారు ఇప్పుడా బార్‌ను మెచ్చుకోలేకుండా వుండ లేకపోతున్నారు.



ఇక తెలుగులో బ్రహ్మమాలిక  అని పిలబడే ఈ చెట్టు ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతాయట అక్కడివారు ముద్దుగా బావొబాబ్‌ అని పిలవబడే ఈ చెట్టు నుంచి వచ్చే పళ్ల రసంతో షర్బత్‌ తయారు చేస్తారట.ఇక వెల్వెట్‌రంగులో ఉండే ఈ చెట్టుపళ్ళ వాసన పెరుగును పోలి వుంటుందట.ఇంక దీనికున్న మరో పేరు అప్‌సైడ్‌ డౌన్‌ ట్రీ,ఇంకా బావొ బాబ్‌ చెట్టు జాతులు మొత్తం తొమ్మిది ఉన్నాయి.వీటిలో ఆరురకాల వృక్షజాతులు మడగాస్కర్‌లో,వుండగా రెండురకాల జాతులు ఆఫ్రికాలో,ఒకరకం వృక్షాలు ఆస్ట్రేలి యాలో, అరేబియన్‌ పెనిసులాలో ఉన్నాయట.ఇదంతా వింటుంటే మనదగ్గర కూడా ఇలాంటి బార్ అండ్ పబ్ వుంటే బాగుండ నిపిస్తుందికదా..

మరింత సమాచారం తెలుసుకోండి: