కొత్త మోటారు వాహనాల చట్టంతో వాహనదారులపై జరిమానాల మోత మోగుతోంది. ఈ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్ప డిన వారికి భారీగా ఫైన్ వేస్తున్నారు. ఒరిస్సా లో మద్యం తాగి ఆటో నడిపిన హరి బంధువు కన్నవారు అనే వ్యక్తి కి నలభై ఏడు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధించారు. మద్యం తాగి ఆటో నడపడమే కాకుండా అతని వద్ద ఆటోకు సంబంధించిన పత్రాలు లేవు. దీంతో ఎంత ఎక్కువ జరిమాన పడింది. అయితే ఆ జరిమానాను తాను కట్టలేనని బాధితుడు చెప్పాడు. తన ఆటోను సీజ్ చేసిన తనను జైలుకు పంపిన తాను జరిమానా కట్టలే నని వాపోయాడు.


అటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గురుగ్రామ్ పోలీసులు ఓ ట్రక్ డ్రైవర్ కు యాభై తొమ్మిది వేల రూపాయలు చలానా విధించారు. సిగ్నల్ జంప్ చేశాడని ఓ ఆటో డ్రైవర్ కు ముప్పై రెండు వేల ఐదువందల రూపాయల జరిమానా విధించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహ్మద్ ముస్తాక్ అనే వ్యక్తి కొన్నేళ్లు గా గురుగ్రామ్ లో ఉంటున్నాడు. దిన సరి కూలీగా పని చేసే అతడు రెండేళ్ల క్రితమే ఆటోకొనుక్కున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం తో పాటు అతడి వద్ద సరైన పత్రాలు లేకపోవటంతో పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకు ముందు గురుగ్రామ్ లోని ఓ స్కూటీ వాలాకు ఇరవైమూడు వేల రూపాయల ఫైన్ వేయటం తో అతడు తన వాహనాన్ని పోలీసులు దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు. నూతన మోటారు వాహన చట్టం అమలు లోకి వచ్చాక ఏపీలో నమోదైన కేసులో తొలి తీర్పు ఆదోనిలో వచ్చిందే డ్రంకన్ డ్రైవ్ కేసులో పది వేల రూపాయలు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన కేసులో పదిహేను వేల రూపాయల జరిమానా విధిస్తూ ఆదోని కోర్టు తీర్పిచ్చింది.




కర్నూలు జిల్లా ఆదోని లో విస్తృతం గా వాహన తనిఖీలు నిర్వహించారు పోలీసులు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలతో డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న వారిని ఆపారు. వాహన ధ్రువీకరణ పత్రా లు వాహన దారుల లైసెన్సు లు చెక్ చేశారు. నిబంధన లు అతిక్రమిస్తూ వాహనా లు నడుపుతున్న వారి పై కొరడా ఝళిపిస్తూ నూతన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఫుల్ గా తాగి బైక్ నడిపినకేసులో జమునకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన కేసులో నాగరాజును అరెస్టు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. జమన్నకు పది వేల రూపాయల నాగరాజుకు పదిహేను వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: