అవును మీరు చదివింది నిజమే. ఈ కథనానికి సంబంధించిన పై ఫొటో చూశారు కదా ? ట్విట్టర్లో నారా లోకేష్ చేస్తున్న  ఇటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శల వల్లే ఆయనకు అభిమానుల సంఖ్య పెరిగిపోతోందట. నిజానికి చంద్రబాబునాయుడుకి పుత్రరత్నం అనే అర్హత తప్ప లోకేష్ కు మరేంలేదు. అయినా వారుసుడి హోదాలోనే పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిపోయారు.

 

పార్టీ పోస్టు కదా ఎలాగూ రేపటి అధ్యక్షుడు కూడా ఆయనే కదా అని అందరూ సరిపెట్టుకున్నారు. అయితే తర్వాత ఎంఎల్సీ అయి దొడ్డిదోవన మంత్రికూడా అయిపోయారు. అక్కడి నుండి లోకేష్ కు అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. నిజానికి లోకేష్ కు ఏ విషయంలో కూడా సరైన అవగాహన లేదు. బహుశా పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు లేదు లేండి. అందుకనే ప్రతీ విషయంలోను తప్పుల మీద తప్పులు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.

 

లోకేష్ ఏ విషయం మీద కామెంట్ చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసినా ఇట్టే దొరికిపోతున్నారు. ఏదో బుర్రలోకి తోచింది ట్విట్టర్లో పెట్టేయటమే కానీ అందులో వాస్తవాలు ఎంతుంది అని ఆలోచన చేయటం లేదు. ’సంపద నుండి చెత్త సృష్టించటం’ ఇందులో ఓ మచ్చు తునక మాత్రమే.

 

ఇక మొన్నటి వరదల సందర్భంగా ప్రకాశం బ్యారేజిలో ఓ బోను అడ్డం పెట్టేసి చంద్రబాబు నివాసముంటున్న కరకట్టమీదకు నీటి ప్రవాహాన్ని మళ్ళించిందనే లోకేష్ ఆరోపణను నెటిజన్లు భలే ఎంజాయ్ చేశారు. లోకేష్ ట్విట్టర్ నుండి ఎప్పుడెపుడు ట్వీట్లు వస్తాయా అని నెటిజన్లు ఎదురు చూస్తుంటారు. ఓ ట్వీట్ రావటం ఆలస్యం వెంటనే నెటిజన్లు ట్వీట్ పై ట్రోలింగ్ మొదలుపెట్టేస్తారు.

 

నిజానికి సెలబ్రిటీలు కూడా తమ అభిమానులను లోకేష్ లాగ ఎంటరటైన్ చేయలేరేమో ? అసలు లోకేష్ గనుక ట్విట్టర్ ను ఉపయోగించటం ఓ నాలుగు రోజులు ఆపేస్తే అభిమానులు ఏమైపోతారో అన్నట్లుగా తయారైంది పరిస్దితి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: