ప్రపంచంలో కొన్ని సంఘటలను చూస్తే నిజంగా ఇది సాద్యమా అనిపిస్తుంది...ఆశ్చర్యం వేస్తుంది.  ఇది చెప్పడానికి కాస్త విడ్డూరమే అయినా..74 ఏళ్ల భామ్మ తాజాగా ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చింది.  ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ(74) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో మంగాయమ్మ ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది.  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ ప్రసవం కోసం స్థానిక అహల్య ఆస్పత్రికి వచ్చింది.

ఇవాళ మంగాయమ్మకు డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం  చేశారు.  వివాహం జరిగిన  57 ఏళ్ల తర్వాత మంగాయమ్మ గర్భం దాల్చింది. గతంలో 70 ఏళ్లకు ప్రసవం ప్రపంచ రికార్డుగా ఉంది. కాగా ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ప్రసవం ద్వారా అరుదైన రికార్డు నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962, మార్చి 22న వివాహమైంది.  వివాహం జరిగిన చాలా కాలం ఈ జంటకు పిల్లలు పుట్టలేదు..పిల్లల కోసం మొక్కని దేవుడు లేడు..తిరగని దేవాలయాలు లేవు, చేయని పూజలు లేవు. 

కానీ దేవుడు మాత్రం వీరిని కనికరించలేదు. అయితే వారి ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. కాగా తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ తాను కూడా ఐవీఎఫ్ పద్దతిని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.

అయితే మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. గడిచిన నవంబరులో గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌ను సంప్రదించింది. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. నేడు పండంటి శిశువులకు జన్మనిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: