ఈ మాట చాలా రోజులుగా వినిపిస్తున్నదే. కాకపోతే ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తమ పార్టీని బిజెపిలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే అదే సమయంలో బిజెపిలో జనసేనను విలీనం చేయమని ఒత్తిళ్ళు వస్తున్నట్లు మాత్రం ఒప్పుకున్నారు.  సరే ఇదంతా పదిహేను రోజుల క్రితం జరిగిన ముచ్చట లేండి.

 

కానీ తాజాగా టిడిపి నుండి బిజెపిలో చేరిన మాజీ ఎంఎల్సీ అన్నం సతీష్ మాట్లాడుతూ డిసెంబర్లోగా జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేసేయటం ఖాయమంటూ జోస్యం చెప్పటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పైగా పవనే అప్పుడు బిజెపి తరపున సిఎం అభ్యర్ధి అవుతారంటూ గట్టిగా చెప్పారు.

 

చిరంజీవిని కూడా బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. అంటే అన్నా, తమ్ముళ్ళిద్దరూ బిజెపిలో చేరటం ఖాయమని సతీష్ చెబుతున్నదాని బట్టి అర్ధమవుతోంది. నిజానికి చిరంజీవికైనా, పవన్ కైనా కార్యకర్తల బేస్ లేదు.  సోదరులిద్దరిలో చిరంజీవే కాస్త బెటరనిపించుకున్నారు. కాకపోతే ఇద్దరికీ ఉన్నదల్లా అభిమానుల మద్దతు మాత్రమే.

 

అదే సమయంలో బిజెపికి నేతల కొరతతో పాటు క్యాడర్ కొరత కూడా ఉంది. అలాగే జనాలను ఆకర్షించే స్ధాయి నేతలు కూడా లేరు. దాంతో చిరంజీవి, పవన్ ను గనుక బిజెపిలో చేర్చుకుంటే ఇద్దరికీ ఓ ఉపయోగం జరుగుతుంది. చిరంజీవి, పవన్ కు పార్టీ నిర్మాణంతో పాటు అంతో ఇంతో పార్టీ నేతలు, క్యాడర్ అండ దొరుకుతుంది.

 

అలాగే  బిజెపికి జనాకర్షక నేతలు రెడీమేడ్ గా దొరుకుతారు. కాబట్టి ఇద్దరికీ ఉపయోగమే. అయితే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనటం అంత ఈజీ కాదు. ఎందుకంటే జగన్ కు జనబలముంది. జనాకర్షక శక్తితో పాటు నేతలు, క్యాడర్ బలం పుష్కలంగా ఉంది. ప్రజా సంక్షేమ పథకాల అమలులో మంచి దూకుడు మీదున్న జగన్ ను తట్టుకోవటమంటే మామూలు విషయం కాదని బిజెపి గుర్తుంచుకోవాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: