జగన్ పాలనా .. రాజన్న పాలనను గుర్తుకు వస్తుందని చాలా మంది వ్యాఖ్యానించం గమనార్హం. జగన్ ఎన్నికలప్పుడు కూడా తన తండ్రి పాలనను మీకు గుర్తుకు తెస్తానని రాజన్న పాలనను తీసుకొస్తానని చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా జగన్ పాలన అందిస్తున్నారు. ఇచ్చిన మాటను తప్పడం .. మడమ తిప్పకపోవటం రాజన్న స్టైల్ ఇప్పుడు జగన్ అదేఫాలో అవుతున్నారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలు జగన్ వెంట వెంటనే అమలు చేస్తూ తాను మాట తప్పే వ్యక్తిని కాదని నిరూపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం అయిన టీడీపీ .. ఉద్యోగులను మభ్య పెట్టి చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి.


చంద్రబాబు వారిని పట్టించుకోకుండా ఐదేళ్లు గడిపేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అదనపు ఆర్ధిక భారం పడుతుందని బాబు భావించి ఆ దిశగా ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దాలుగా ఏ సీఎం తీసుకోని నిర్ణయం జగన్ తీసుకోవటంతో అందరూ జై జగన్ అంటూ మీడియ ముందు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


ఒకటి ఏంటి ఇప్పటివరకు మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని డేట్ ను కూడా అనౌన్స్ చేసి మరీ అమలు చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే జగన్  సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. రాష్ట్ర బడ్జెట్ సహకరించకపోయినా .. తన తండ్రి ఏ విధంగా అయితే హామీలు నెరవేర్చారో అదే మాదిరిగా రాజన్న బాటలో నడుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: