పవన్ కళ్యాణ్  తాను 25 ఏళ్ళు రాజకీయంలో ఉండటానికి వచ్చానని పదే పదే చెబుతుంటారు. మరి 25 ఏళ్ళు రాజకీయం చేయాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నట్టు ఉంటే కష్టమని చెప్పాలి. సభలో నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం వరకే పవన్ రాజకీయం పరిమితం అవుతుంది. ఏ ఒక్క ప్రాబ్లెమ్ మీద గట్టిగా పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. పవన్ ఇక నుంచైనా తాను చేస్తున్న తప్పులను తెలుసుకోవటం మంచిది. జనసేన .. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి.


జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది. పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం.


అయితే ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కనీసం ఎన్నికల మూడేళ్ళ నుంచైనా ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలో తమ ఓటమికి కారణం ఏంటో తెలుసుకున్నంటున్నారు. అందుకే ఈ సారి క్షేత్ర  స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఫామ్ చేస్తున్నారు.  కానీ పవన్ మాటలు ఎప్పటిలాగే ఉన్నాయని .. ఇటువంటి మాటలతో పవన్ ..  పార్టీని నిలబెట్టడం కష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: