రేపు అర్ధరాత్రి భారతదేశ కీర్తి పతాకం ప్రపంచవేదికపై రెపరెపలాడుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగంలో అత్యంత కీలకమైన తుది ఘట్టం ఆవిష్కృతం కానుంది. దీని కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఇప్పటికే అనేక దశలను విజయవంతంగా దాటుకుంటూ వచ్చిన చంద్రయాన్ 2 ఇప్పుడు చంద్రుని మీద దిగి చరిత్ర సృష్టించనుంది. దాదాపు నలభై రోజుల పాటు ప్రయాణించిన చంద్రయాన్ తన ఆఖరి దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ లాండర్ చంద్రయాన్ కి దగ్గరగా వచ్చింది



జూలై ఏడు తెల్లవారుజామున 1:55 నిమిషాలకి చంద్రుని మీద ల్యాండ్ కానుంది. ఈ అపూర్వ ఘట్టం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. దీంతో అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ ఈ రికార్డు సృష్టించనుంది. చంద్రయాన్ 2 మిషన్ లోని విక్రమ్ లాండర్ ని జాబిలమ్మకి మరింత దగ్గరగా చేర్చేందుకు నిన్న తెల్లవారుజామున మూడు 3:42 నిమిషాలకి ఇస్రో శాస్త్రవేత్తలు రెండోసారి కక్ష దూరాన్ని తగ్గించారు. దీని కోసం ల్యాండర్ లో నింపిన ఇంధనాన్ని తొమ్మిది సెకన్ల పాటు మండించారు.



బెంగుళూరు సమీపంలోని బైలాలు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను నిర్వహించారు. ప్రస్తుతం ల్యాండర్ చంద్రునికి దగ్గరగా ముప్పై ఐదు కిలో మీటర్లు, చంద్రుడికి దూరంగా నూటొక్క కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమిస్తోంది. రేపు అర్ధరాత్రి 1:30 నిమిషాల నుంచి రెండున్నర గంటల లోపు ల్యాండర్ ను చంద్రుని ఉపరితలంపై మృదువుగా దించనున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: