కేంద్ర ఆర్ధిక మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తెల్పింది. ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌లో నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టేందుకు.... ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేలా చిదంబరం ప్రభావితం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంమీద.. చిదంబరంపై ఉన్న రెండు కీలక కేసులు నమోదయ్యాయి. ఈ ఆర్ధిక నేరాన్ని బిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది.





చిదంబరానికి ముందస్తు బెయిల్ జారీ చేసేందుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీని వల్ల  దర్యాప్తు సంస్థ పక్రియపై ప్రభావం పడే అవకాశాలుంటాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టుకొట్టేసింది. ఫలితంగా ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే విషయంలో కూడా నిరాకరించింది. చిదంబరానికి ఓ కేసులో ఊరట దక్కినా మరో కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసులో చిదంబరానికి ఊరట లభించింది. ఆయనతో పాటు కుమారుడు కార్తీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.





సీబీఐ ప్రత్యేక కోర్టు. అయితే కోర్టు కొన్ని షరతులు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా చిదంబరం దేశం విడిచి వెళ్లకూడదని, విచారణ అధికారులు పిలిచినప్పుడు తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ కస్టడీ ముగిసిన తర్వాత చిదంబరాన్ని ఈడీ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  ఓదాంట్లో కొంత ఊరట లభిస్తే..మరోకేసులో షాకిచ్చింది కోర్టు. అటు  బెయిల్ తిరస్కరణతో ఇక ముందస్తు బెయిల్‌‌ను నిరాకరించిన కోర్టు అరెస్ట్ అనంతరం రెగ్యూలర్ బెయిల్ కు మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: