దగ్గుబాటి వెంకటేశ్వరరావు...తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నేత. ఎన్టీఆర్ అల్లుడుగా, టీడీపీ అధినేత చంద్రబాబు తోడల్లుడుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత. ఒకప్పుడు టీడీపీలో తర్వాత కాంగ్రెస్ పార్టీల్లో చక్రం తిప్పిన దగ్గుబాటి ప్రస్తుతం వైసీపీలో ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తోంది. 2014 తర్వాత రాజకీయాలకు దూరమైన దగ్గుబాటి కుమారుడు హితేష్ చెంచు రామ్ కోసం మొన్న ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇక చేరడమే జగన్ హితేష్ కు పర్చూరులో పోటీ చేసే అవకాశం కల్పించారు.


కానీ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో హితేష్ పోటీ చేయడానికి అనర్హుడు అయ్యాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయిన దగ్గుబాటి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇష్టం లేకుండా ప్రచారం చేసిన దగ్గుబాటి ఓటమి పాలయ్యారు. అయితే దగ్గుబాటి ఓడిపోయిన జగన్ నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి అప్పగించారు. ఇన్ చార్జ్ పదవి ఉన్న దగ్గుబాటి పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారంటా.


దీంతో పార్టీ అధిష్టానం సీరియస్ తీసుకుని దగ్గుబాటిపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ఈ నిఘాలో అసలు దగ్గుబాటి పార్టీ కార్యక్రమాలని యాక్టివ్ గా చేయట్లేదని,  కార్యకర్తలని పట్టించుకోవట్లేదని తేలినట్లు తెలుస్తోంది.  దీంతో అధిష్టానానికి, దగ్గుబాటి మధ్య దూరం పెరిగిందట. పైగా దగ్గుబాటి భార్య కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇక తాజాగా రాష్ట్రంలో వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది.


పురందేశ్వరి కూడా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో దగ్గుబాటికి తానొక పార్టీలో భార్య ఒక పార్టీలో ఉండటం నచ్చట్లేదట. అటు ఎలాగో జగన్ కు, దగ్గుబాటి మధ్య గ్యాప్ పెరిగింది. ఇలాంటి తరుణంలో దగ్గుబాటి భార్య రూటులోకి వెళ్ళి బీజేపీలో చేరిపోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారట. మరి చూడాలి రానున్న రోజుల్లో దగ్గుబాటి ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: