Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 8:20 am IST

Menu &Sections

Search

టీడీపీ మాజీ మంత్రుల రాజకీయ సన్యాసం..!

టీడీపీ మాజీ మంత్రుల రాజకీయ సన్యాసం..!
టీడీపీ మాజీ మంత్రుల రాజకీయ సన్యాసం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2004 నుంచి 2014 వరకు పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి...కొనఊపిరితో కొట్టుమిట్టాడిన సీనియర్ తెలుగుదేశం నేతలు..  2014 లో అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి మంచి పదవులు దక్కించుకున్నారు. అలాగే పాలనలో దిగి మరో 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని, ఈలోపే పదవులు అనుభవించేసి రిటైర్ అయిపోవాలని అనుకున్నారు. కానీ వారి ఆశ ఐదు సంవత్సరాల్లోనే ఆవిరైపోయాయి.


2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితమైపోయింది. దీంతో చాలామంది నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోగా, మరికొందరు రాజకీయ సన్యాసం వైపు పయనిస్తున్నారు. ఆ రాజకీయ సన్యాసం వైపు వెళ్ళే ఎక్కువ మంది మాజీ మంత్రులే కావడం గమనార్హం. రాజకీయ సన్యాసం తీసుకునే నేతల్లో మొదటగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. 2014 లో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి పదవి దక్కించుకున్నారు.  ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈయన మొన్న ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ కుమార్ యాదవ్ చేతుల్లో ఓడిపోయారు.


ఇక ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పెద్దగా అడ్రెస్ లేరు. పార్టీలో యాక్టివ్ గా లేరు. జగన్ ప్రభుత్వం ఎక్కడ తమ విద్యాసంస్థలపై నిఘా పెడుతోందో అని సైలెంట్ అయిపోయారు. పైగా నారాయణ కూతురు ఇటీవల జగన్ ని కలిసి నారాయణ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నారాయణ మీడియా ముందు కనపడటం లేదు. అసలు సైలెంట్ గా ఉండటమే కాకుండా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఇక ఎప్పుడో ఎన్నికల్లో పోటీ చేయడం మానేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా మెల్ల మెల్లగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు కనపడుతోంది. అలాగే మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కుమారుడు విజయ్ కు బాధ్యతలు అప్పగించేసి  తాను సైలెంట్ అయిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు అనేక వివాదాల్లో చిక్కుకున్న మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ అసలు రాజకీయాల జోలికి వెళ్లొద్దని ఫిక్స్ అయిపోయారని సమాచారం. కుమారుడు, కుమార్తె చేసిన ఘనకార్యాలకు కోడెల సైలెంట్ అయిపోనున్నారు.


అదేవిధంగా వరుసగా 2004, 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాల పట్ల పూర్తిగా విసుగుచెందినట్లు తెలుస్తోంది. ఆయన కూడా కుమారుడికి  బాధ్యతలు అప్పగించేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలని చూస్తున్నారని సమాచారం. ఇక సీనియర్ నేతలు అంతా ఓడిపోయినా ఆరోసారి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరీ కూడా నెక్స్ట్ ఎన్నికల నుంచి పోటీక చేయనని ఇప్పటికే ప్రకటించేశారు కాబట్టి ఇక ఆయన కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే.


tdp-ex-ministers-political-future
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబు.. అంత చీప్ అయిపోయారా..?
అధికారం కోసం బాబోరు అందితే జుట్టు.... అంద‌క‌పోతే కాళ్లు
ఆ విషయంలో జగన్ తండ్రిని మించుతాడా...!
ఆ టీడీపీ సీనియర్ అస్త్ర సన్యాసం చేసేశారా...!
అక్కడ టీడీపీ భవిష్యత్ శూన్యమేనా బాబుకు ఆశ‌ల్లేవ్‌..!
ఇక వంశీ బుక్ అయినట్లేనా... వారంలోనే మ‌రో షాక్‌..
జ‌గ‌న్ ఒక్క సంత‌కం... మూడున్న‌ర ల‌క్ష‌ల కుటుంబాల్లో వెలుగులు
హుజూర్‌న‌గ‌ర్లో ఓటు రేటెంతంటే...
ఇంట‌ గెలిచి.... ర‌చ్చా గెలుస్తోన్న జ‌గ‌న్‌
జ‌న‌సేన‌కు ' రాపాక ' రాంరాం... పార్టీలో ఏం జ‌రుగుతోంది...!
వెయ్యి నోటుపై ఆర్బీఐ షాకింగ్ ట్విస్ట్‌
విజ‌య్ `విజిల్` ప్రీ రిలీజ్ బిజినెస్‌... టార్గెట్ ఎంతంటే..
ఏపీలో ఉద్యోగాల విప్లవం... చ‌రిత్ర‌లోనే స‌రికొత్త ట్రెండ్‌
బాబు అంటే ఆ జిల్లా టీడీపీ లీడ‌ర్ల‌కు అంత అలుసా...!
మ‌హిళ‌ల ఓట్ల‌న్నీ జ‌గ‌న్‌కే.... నాలుగు నెల‌ల ప్రోగ్రెస్ చెప్పేస్తోంది...
దగ్గుబాటి దంపతులకు జగన్ బంపర్ ఆఫర్..?
జ‌గ‌న్ ఆ ఇద్ద‌రిని ఎందుకు దూరం పెడుతున్నారు..?
అర్ధం పర్ధం లేని ఆంధ్రజ్యోతి...అడ్డగోలు రాత‌లు ఆపదా..?
నిన్న వార్నింగ్ ఇచ్చి.... నేడు వాటేసుకుంటోన్న బాబు..
ప‌వ‌న్ పాలిటిక్స్‌కు దూర‌మేనా... నేడు ఏం జ‌ర‌గ‌నుంది..!
మీడియాకు జ‌గ‌న్ సంకెళ్లా... నిజ‌మెంత‌...? గ‌తంలో బాబు చేసిందేంటి...?
జ‌గ‌న్ పాల‌న‌.. కేసీఆర్‌కు దిగులు.. రీజ‌నేంటి...!
హుజూర్‌న‌గ‌ర్లో టీఆర్ఎస్‌ కోరుకుందే జ‌రిగిందా..!
తెలంగాణ‌లో లిక్క‌ర్ కింగ్‌లు ఎవ‌రంటే...
జ‌గ‌న్ తాజా డెసిష‌న్‌: బాబోరు ఉక్కిరి బిక్కిరి
ట్విట్టర్ పిట్ట బయటకొచ్చి కూసేదెప్పుడో..?
ఆ వైసీపీ ఎమ్మెల్యే అస్సలు తగ్గట్లేదుగా...
జ‌గ‌న్ రూటే స‌ప‌రేటు... దారిత‌ప్పితే సొంత ఎమ్మెల్యేలైనా డోన్ట్ కేర్‌
ఆ మంత్రులకు ఉద్వాసన తప్పదా..?
న‌వంబర్‌లో బీజేపీ ట్విస్ట్ ఇస్తుందా... జగన్ అంత సీన్ ఇస్తారా...?
ఏపీలో రైతుల ద‌శ మారుతోందా.... జ‌గ‌న్ పాల‌న ఏం చెపుతోంది...
టీడీపీలో పొలిట్‌బ్యూరో ముస‌లం... బాబుకు మ‌రో షాక్‌...!
బ‌న్నీ వ‌ర్సెస్ మ‌హేష్ ... త‌ప్పు ఎవ‌రిది... !
బాల‌య్య వ‌ర్సెస్ ర‌వితేజ మ‌ళ్లీ వార్‌... మ‌ధ్య‌లో మెగా హీరో
హుజూర్‌న‌గ‌ర్లో టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ అస్త్రం..
హుజూర్‌న‌గ‌ర్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు వ‌ణుకు పుట్టిస్తోందెవ‌రు..!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.