తెలుగుదేశంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు. అయితే వారిలో ఎవరు ఉంటారో, ఎవరు పార్టీ వీడతారో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు నేతలకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా కొందరు నేతలు తమంతట తాము టిడిపిని వీడే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎప్పుడూ అధికార పార్టీలో ఉండటానికి ఇష్టపడే గంట వైసీపీ లోకి వెళతారని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే తాజాగా జిల్లాలో ఉన్న పరిస్థితులు జిల్లా మంత్రి అవంతితో ఉన్న విభేదాలతో వైసీపీలోకి గంట ఎంట్రీ సాధ్యం కాదంటున్నారు.



ఇప్పుడున్న పరిస్థితుల్లో గంటాను జగన్ తన పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవని వైసీపీ వర్గాలు ఓపెన్ గానే చెబుతున్నాయి. ఒకవేళ గంటా వైసీపీ లోకి వెళ్లినా జగన్ ఫిక్స్ చేసిన రూల్స్ ప్రకారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో గెలిచి రావలసి వుంటుంది. అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల ఎఫెక్ట్ తో గంటా ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. గంటాకి వైసిపి డోర్స్ క్లోజ్ అయినా పార్టీ మారడంపై మాత్రం ఇప్పటికీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో బీజేపీకి చెందిన అత్యంత కీలక నేతతో ఆయన భేటీ అయ్యారని సమాచారం. జాతీయ స్థాయిలో బిజెపిలో కీలకంగా ఉన్న నేతతో గోప్యంగా జరిగిన ఈ భేటీ తరువాత ఆలస్యంగా బయటకు పొక్కింది.దాంతో బిజెపితో గంటా చర్చల విషయం చర్చనీయాంశంగా మారింది.



ఒకవేళ గంటా ఇప్పుడు బీజేపీ లోకి వెళ్లినా కూడా, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గుర్తుపై ఏపీలో గెలిచే అవకాశం లేదు. ఏపిలో స్పీకర్ ఇప్పటికీ ఫిరాయింపులపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఫిరాయింపుదారులకు తన సభలో స్థానం ఉండదని ప్రకటించారు. దాంతో ఇప్పుడు బిజెపి లోకి వెళ్లిన గంటా రాజీనామా చేయక తప్పని పరిస్థితి. అందుకే ఆ మాజీ మంత్రి ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారట. పార్టీ మార్పు బైఎలెక్షన్ వస్తే పరిస్థితులపై గంటా అనేక లెక్కలు వేసుకుంటున్నారు అని సమాచారం. అయితే అవేవీ సంతృప్తికరంగా లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో గంటా ఉన్నారని తెలుస్తోంది. అలాగని ప్రతిపక్ష టిడిపిలో కొనసాగలేనని గంటా భావిస్తున్నారట.



స్థానికంగా అధికార పార్టీ నేతలతో ఉన్న విభేదాలు, జిల్లా రాజకీయాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లో అయినా ఉండాలని గంటా భావిస్తున్నట్టు చెబుతున్నారు. గంటా వ్యవహారంపై టీడీపీ పెద్దల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన అందరినీ కలుపుకొని పార్టీ మారే పరిస్థితి లేదని, తనకు స్థానికంగా ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో పార్టీ మారే అవకాశముందని చెబుతున్నారట. అయితే ఆయన టిడిపిని విడిచి పోరని కొందరు నేతలు చెబుతున్నారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏపీలో శాసన సభ్యులుగా ఉండి ఎవరూ వేరే పార్టీలో చేరలేదు. ఒకవేళ ఎవరు చేరినా కూడా బై ఎలక్షన్స్ తప్పవు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అదే ఇప్పుడు పక్క పార్టీల వైపు చూస్తున్న వారికి ప్రధాన ప్రతిబంధకంగా తయారైంది. మరి గంటా అయోమయానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: