ఏపీలో వ‌రుస షాకులతో విలవిల్లాడుతున్న విపక్ష తెలుగుదేశం పార్టీకి మరో అదిరిపోయే షాక్ తగలనుంది. పలువురు కీలక నేతలు బిజెపి, వైసీపీలోకి జంప్ చేస్తుండగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీలో నెలకొన్న నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజా ఎన్నికలకు ముందే తోట వైసీపీలోకి వెళ్ళిపోతారు అని ప్రచారం జరిగింది. ఆయన సోదరుడు తోట నరసింహం ఎన్నికలకు ముందు వైసీపీలోకి చేసేశారు. ఇక తోట వియ్యంకుడు సామినేని ఉద‌య‌భాను కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్నారు.


అటు సోదరుడు, ఇటు వియ్యంకుడు ఒత్తిడితో తోట ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ను కలిసిన టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టిడిపి నేతలు తోట మారిపోతారని జోరుగా ప్రచారం చేస్తుండడం చూస్తే ఈ వార్తలు నిజమ‌నే అనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిన తోట రామచంద్రపురం సీటుతో పాటు తన తనయుడికి కాకినాడ రూరల్ సీటు కావాలని జగన్ను అడగగా... జగన్ రామచంద్రపురం సీట్లు మాత్రమే ఇస్తానని అనడంతో తోట సైలెంట్ అయినట్టు ప్రచారం జరిగింది. తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా పార్టీ సీనియర్లు నిమ్మకాయల చినరాజప్ప, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తనను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆవేదనతో ఉన్న ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌.


ఈ క్ర‌మంలోనే తోట జ‌గ‌న్‌ను కూడా క‌లిసిన‌ట్టు ప్రచారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత తోట కాకినాడలో టిడిపి కాపు నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ యువనేత లోకేష్ కాపు నేతలకు అన్యాయం చేస్తున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆర్థికపరంగా లోకేష్ తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకుని... కాపులకు అన్యాయం చేశారన్న అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. ఇక లోకేష్ నాయకత్వంలో టిడిపికి భవిష్యత్తు లేదని డిసైడ్ అయిన తోట వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఏదేమైనా  పార్టీలో తోట అసంతృప్తితో రగిలిపోతున్న మాట మాత్రం వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: