ప్రభుత్వం మారినపుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కూడా మారిపోతుంది.  మారిన ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులను, తమకు నచ్చిన వ్యక్తులను బోర్డు మెంబర్లుగా నియమిస్తుంది.  ఇది ఆనవాయితీగా వస్తున్నది.  ఈ దేవాలయాన్ని ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి దేశవిదేశాల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకోవానికి కులం మతం అడ్డులేవు. అయితే, దేవాలయం పాలక మండలంలో విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను పాటిస్తోంది.  హిందువులకు మాత్రమే ఆలయ బోర్డు సభ్యులుగా నియమించాలనే రూల్ ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నారు.  


 ఇటువంటి దేవాలయంలో భక్తుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. అయితే టీటీడీ బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు సభ్యులుగా ఉంటారని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు అన్యమతస్తులు అయితే వారిని బోర్డులో సభ్యులుగా ఏవిధంగా తీసుకొంటారు..? హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండా వ్యవహరించవలసిన ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తగదు. ఇతర మతస్తులకు ఆలయ వైదిక ధర్మాలు తెలుస్తాయా..? ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తులకు టీటీడీ పదవులు కట్టబెట్టడం హిందువుల మనోభావాలను కించపరచడమే అవుతుంది. 


కావున గవర్నర్‌ గారు తమ దృష్టికి వచ్చిన ఈ అంశాన్ని సంపూర్ణంగా పరిశీలించి అవసరమైతే దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలి. స్థానికంగా గెలుపొందిన వ్యక్తి అన్యమతస్తులు అయితే అటువంటి వారు బోర్డు సభ్యులుగా నియమితులు కాకుండా ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి చర్యలు హిందూ దేవాలయాలు, కోట్లాది మంది భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతాయి కనుక గవర్నర్‌ గారు వారి మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమూరి ఆనంద్ సూర్య ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: