బార్ కు వెళ్లి ఎవరైనా బీర్ ఆర్డర్ చేస్తారు లేదంటే మందు ఆర్డర్ చేస్తారు..అంతేకాని ఎవరైనా పాలు ఆర్డర్ చేస్తారా చెప్పండి.  అసలు బార్ అని తెలిసి అటువైపు వెళ్లి పాలను ఆర్డర్ చేస్తే.. వాళ్ళను ఏమనాలి.. ఎలా వాళ్ళను ట్రీట్ చేయాలి.. చిన్న పిల్లలుగా ట్రీట్ చెయ్యొచ్చు కదా.. అవును ట్రీట్ చెయ్యొచ్చు. బార్ కు వెళ్ళింది ఓ చిన్నమ్మాయి.  ఆ అమ్మాయి వయస్సు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే.  


మూడేళ్ళ వయసు కలిగిన మైలా అండర్స్ అనే ఓ అమ్మాయి సెలవుల్లో తన కుటుంబంతో కలిసి క్రొయేషియాలోని ఓ హోటల్ కు వెళ్ళింది.  హోటల్ లో ఉండగా తల్లిదండ్రులు సన్ బాత్ కు వెళ్తూ.. కూతును వెంటబెట్టుకొని వెళ్లేవారు.  అలా వెళ్లే సమయంలో వాళ్లతో పాటు బ్యాగ్ లో పాలప్యాకెట్ తీసుకొని వెళ్లేవారు.  అయితే, ఆరోజు వెళ్లే సమయంలో పాల ప్యాకెట్ మరిచిపోయారు.  


సన్ బాత్ కు వెళ్లిన కాసేపటికి మైలాకు ఆకలి వేసింది.  వెంటనే పాలప్యాకెట్ కావాలని అడిగింది.  బ్యాగ్ లో లేకపోవడంతో వెళ్లిన తరువాత తీసుకుందామని చెప్పింది మైలా తల్లి.  కాసేపు అక్కడే కూర్చున్న చిన్నారి మైలా ఆకలికి తట్టుకోలేక పోయింది.  వెంటనే ఆ పక్కనే బార్ ఉంటె అందులోకి వెళ్ళింది.  


పాపం ఆ చిన్నారికి అది బార్ అని తెలియదు.  లోపలికి వెళ్లి పాలప్యాకెట్ కావాలని ఆర్డర్ చేసింది.  చిన్నారి లోపలికి రావడం చూసి షాక్ అయ్యారు.  వచ్చి పాలప్యాకెట్ అడిగే సరికి అందరు ఆశ్చర్యపోయారు.  తరువాత చిన్నారిని నిరుత్సాహ పరచకూడదని చెప్పి పాలప్యాకెట్ ఉండదని గ్లాస్ పాలు కావాలంటే ఉంటాయని చెప్పింది.  మైలా దానికి సరే అని చెప్పింది.  మైలా కోరినట్టే పాలు గ్లాస్ లో తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పాలు తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.  అప్పటికే అక్కడికి వచ్చిన మైలా తండ్రి ఆ దృశ్యాన్ని చిన్న వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: