అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు నవ్వాలో,ఏడ్వాలో అర్ధం కాని పరిస్దితిని కల్పిస్తాయి.ఇంకొన్ని సంఘటనలు షాక్‌కు గురిచేస్తాయి.ఇక మధ్యతరగతి జీవితాల్లో ఓ వంద రూపాయలు దోరికాయంటే వారి ముఖాల్లో సంతోషం నిండిపోతుంది.అవే డబ్బులు వారి జేబుల్లోనుండి పోయాయనుకో చాల రోజులు బాధపడుతారు.ఇప్పటికే మూల్గే నక్కమీద తాటికాయ పడ్డట్లున్న జీవితాలకు కరెంట్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి.విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ఫ్లాంట్లో ఎంత విద్యుత్ ఉంటుందో తెలియదు కాని వారిచ్చే బిల్లుల్లో భరించ లేనంత పవర్ సప్లై అవుతుంది.



ఇక ఈ మధ్యతరగతి బ్రతుకులకు నెలనాడు ఓ వెయ్యికి మించి కరెంట్ బిల్లు వస్తే షాక్ అవుతారు.ఎందుకు అంతలా వచ్చిందని తెగ ఆలోచి స్తారు.అలా కాకుండా ఒక్కోసారి ఆ బిల్లు లక్షల్లో వుందనుకో హర్టెటాకొచ్చి హస్పిటల్ ల్లో అడ్మిట్ అవుతారు.ఇంక కొంతమందికి అప్పుడప్పుడు 10 లక్షలు, 20 లక్షలు బిల్లు వచ్చిన సందర్భాలూ కూడా ఎన్నో ఉన్నాయి.కాని ఏకంగా కోట్లల్లో బిల్ వస్తే వారి పరిస్దితి ఏంటి.విరామం లేకుండా నడిచే కర్మాగారాలకుంటున్నారా అంత బిల్లు రానికి అని జోకెయ్యెచ్చు మరే నిజమండి.తాజాగా ఓ పాఠశాలకు రూ.618 కోట్ల బిల్లు వేసి షాకిచ్చారు అధికారులు.సాధారణ స్కూలుకు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడంతో పాఠశాల యాజమాన్యం మైండ్ బ్లాకైంది.ఇదేదో మారుమూల ప్రాంతమనుకునేరు మన ప్రధాని మోదీ సారు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లో జరిగిన ఘటన.



ఈ విషయాన్ని స్కూల్ యజమాన్యం విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దీనిపై స్పందించిన అధికారులు సాప్ట్‌వేర్ తప్పిదం వల్లే అంత బిల్లు వచ్చిందని.అది పొరపాటుగా జరిగిందని తెలిపారు.ఇక విద్యుత్ అధికారుల తీరుపై స్కూల్ మేనేజ్‌మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.గతంలో కూడా ఇలాగే తప్పుడు బిల్లు వచ్చాయని..ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని వందల కోట్లలో బిల్లు వేసి మమ్ములను హింసిస్తూనారంటు వాపోతున్నారు స్కూల్ సిబ్బంది.ఏది ఏమైనా అంతబిల్లంటే ఎవరికైన గుండెలో దడ మొదలవుతుందికదా అనుకుంటున్నారు ఈ వార్త తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: