అనుభవం అని బోరవిడుచుకున్న చంద్రబాబు పాలన అలా ముగిసింది. తాను తప్ప ఎవరూ ఏపీకి దిక్కు కాదన్న బాబును జనం అలా పక్కకు పెట్టేశారు. అయిదేళ్ళ పాటు రాజ్యం చేయమని అప్పగిస్తే ఏపీని మరింతగా ఇబ్బందుల పాలు చేసిన చంద్రబాబు తీరుకు జనం నిరసన తెలిపినట్లుగా ఓట్ల వర్షం వ్యతిరేకంగా కురిపించారు. ఫలితంగా చంద్రబాబు దారుణమైన పరాజయాన్ని చూడాల్సివచ్చింది. ఇక జగన్ కొత్త సీఎం అయ్యాక ఏం చేస్తాడంటూ బాబు వేళాకోళం ఆపడంలేదు.


ప్రపంచ బ్యాంక్ వెనక్కి పోయింది. మిగిలిన బ్యాంకులు కూడా వెళ్ళిపోయాయి. అదంతా జగన్ వల్లనేనని తమ్ముళ్ళ ద్వారా అనిపించి తాను కూడా పెద్ద గొంతు చేసుకున్న చంద్రబాబుకు ఇపుడు జగన్ మార్క్ పాలన ఏంటో అర్ధమవుతోంది. జగన్ ఏపీకి చక్కదిద్దుకుంటూ పాలనను గాడిలో పెడుతున్న తీరుతో పలువురు బ్యాంకర్లు ఆకర్షితులవుతున్నారు. దాంతో ఏపీకి ఆర్ధిక సాయం అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఒక్కోటిగా అంతర్జాతీయ బ్యాంకులు ఏపీకి అప్పులు ఇవ్వడానికి తాము సిధ్ధం అంటున్నాయి.


న్యూ డెవలంప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావడంతో  ఏపీ అభివ్రుధ్ధి పైన అశలు పెరుగుతున్నాయి. ఏపీలో రోడ్ల అభివ్రుధ్ధికి రుణాలు ఇవ్వడానికి ఆ బ్యాంక్ సుముఖంగా ఉంది. రుణంలో 30 శాతం ఏపీ సర్కార్ సమకూరుస్తుండగా 70 శాతం బ్యాంక్ ఇస్తుంది.32 ఏళ్ళ కాలవ్యవధిలో ఈ రుణాన్ని తీర్చాల్సివుంటుంది.


జగన్ సర్కార్ రోడ్ల అభివ్రుధ్ధితో పాటు, పాఠశాలలు, ఆసుపత్రుల అభివ్రుధ్ది, తాగు నీరు సదుపాయం మెరుగుదల వంటి వాటికోసం ఈ రుణాన్ని తీసుకుంటోంది. మొత్తం 25 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని జగన్ బ్యాంక్ ప్రతినిధులకు విన్నవించారు. దానికి బ్యాంక్ అనుకూలంగా స్పందించింది. తొందరలో ఈ రుణం మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో మరిన్ని బ్యాంకులు  ఏపీ అభివ్రుధ్ధిలో పాలుపంచుకోవడానికి సిధ్ధంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: