గత కొంతకాలంగా ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  కాలనీలు మునిగిపోయాయి.  చాలా ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  మెట్రో  రైల్ సర్వీస్ లు నిలిచిపోయాయి.  రాకపోకలకు అంతరాయం కలిగింది. స్కూల్, కార్యాలయాలు మూతపడ్డాయి.  


గతంలో ఎప్పుడూ లేని విధంగా ముంబైలో వాతావరణం మారిపోయింది.  గతంలో కంటే ఈసారి వర్షం ఎక్కువుగా కురిసింది.  ముంబై నగరంతో పాటు అటు ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ కూడా ఈ వర్షం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  విమాన సర్వీస్ లను రద్దు చేశారు.  ఈ రద్దు కారణంగా విమానాలు ఎయిర్ పోర్ట్ లోనే నిలిచిపోయాయి.  


 ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ పై దీని ప్రభావం పడింది. ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన ఇండిగో ఫ్లైట్స్ చాలావరకు క్యాన్సిల్ చేశారు.  ముంబై నుంచి ఢిల్లీ వరకు వెళ్లాల్సిన ఫ్లైట్స్ ఉన్న ప్రయాణికులు పాపం రాత్రి మొత్తం ఫ్లైట్ లోనే ఉండిపోయారట.  రాత్రి ప్రయాణం చేయాల్సిన ఫైట్ ఉదయం వరకు ప్రయాణికులతో రన్ వే మీదనే ఆగిపోయింది.  


తెల్లారిన తరువాత ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది.  రాత్రి ఫ్లైట్ లో ఆహారం ఇవ్వలేదని, ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు కంప్లైంట్ చేశారు.  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనిపై వివరణ ఇవ్వాలని ఇండిగో యాజమాన్యాన్ని కోరింది.  ఎన్ని సర్వీస్ లను క్లోజ్ చేశారు... ఎన్ని రన్ వే నిలిచిపోయాయి కారణాలు ఏంటి అనే దానితో కూడిన వివరణ ఇవ్వాలని కోరింది. డిజేసిఏ కోరిన ప్రకారం నివేదికను ఇండిగో ఎయిర్ లైన్స్ రెడీ చేస్తున్నది.  ఈ ఎయిర్ లైన్స్ చేస్తున్న నివేదికను బట్టి ఇండిగో ఎయిర్ లైన్స్ మీద చర్యలు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటుంది డిజేసిఏ. 


మరింత సమాచారం తెలుసుకోండి: