హైదరాబాద్ దేనికి ప్రసిద్ధి అంటే.. హైదరాబాద్ దమ్ బిర్యానీ, చార్మినార్, బుద్దుడి విగ్రహం, హైటెక్ సిటీ ఫేమస్.  ఇంకా చెప్పాలి అంటే.. రోడ్డుపక్కన దొరికే పానీపూరి బాగా ఫేమస్.  దీన్ని హైదరాబాద్ భాషలో గప్ చుప్ అంటారు.  వేలాది మంది ఈ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు.  దీనిపై లాభాలు అదే రేంజ్ లో ఉంటాయి.  రెండు రూపాయలు పెట్టుబడి పెడితే.. ఐదు రూపాయలు లాభం వస్తుంది.  


చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా పానీపూరిని ఇష్టంగా తీసుకుంటారు.  పానీపూరిలో అంట స్పెషాలిటీ ఏంటి అంటే.. ప్రత్యేకంగా ఇది అని చెప్పలేము.. కాకపోతే.. అందులో ఉండే పానీ టేస్ట్ గా ఉంటుంది.  అందుకే దానివైపు ఆకర్షితులౌతుంటారు.  పానీపూరిలో పానీని ఎలా తయారు చేస్తారో తెలుసా..నీళ్లలో పుదీనా, చింతపండు వంటివి కలిపి దీన్ని తయారు చేస్తారు. 


ఇలా పూరిని తయారు చేసిన తరువాత దాన్ని పానీలో ముంచి తింటారు.  ఈ నీళ్లను సక్రమంగా తయారు చేస్తే బాగానే ఉంటుంది.  కానీ, చాలా చోట్ల ఈ నీళ్లను తయారు చేసే విధానం దారుణంగా ఉంటుంది.  మాములు నీళ్లను తీసుకొని ఎలా పడితే అలా తయారు చేస్తుంటారు.  మంచి నీళ్లను వాడకుండా..  బోర్ వాటర్ ను  ఉపయోగించడం వలన రోగాల బారిన పడాల్సి వస్తుంది.  కొన్ని చోట్ల మురికిగా ఉండే నీళ్లను పానీపూరి తయారు చేయడానికి వాడుతుంటారు. 


ఇలా శుభ్రత పాటించకుండా, ప్రమాణాలు పాటించకుండా పానీపూరిని తయారు చేయడం వలన వాటిని తిన్న చాలామంది రోగాల బారిన పడుతున్నారు.  అయితే, అలా రోగాల బారిన పడిన వ్యక్తులు ఇవి తినడం వలన రోగాలు వచ్చాయి అని తెలుసుకోలేకపోతున్నారు.  అన్ని చోట్ల తయారు చేసే పానీపూరి ఇలానే ఉంటుంది అని చెప్పలేం. కాకపోతే తీసుకునే ఆహారం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: