2014లో ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ, 2019 దగ్గరకు వచ్చే సరికి దారుణంగా ఫెయిల్ అయ్యింది.  కేవలం 23 సీట్లతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాబు పరాజయం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.  చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించలేదు.  రాజధాని నిర్మాణం అంటూ ప్లానింగ్ కోసమే ఎక్కువగా నిధులు ఖర్చు చేశారు.  


పైగా 2014లో తెలంగాణాను డివైడ్ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన బాబు, అదే కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలనే చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణాలో దారుణంగా ఓడిపోయింది.  తెరాస పార్టీని ఎవరూ ఊహించని విధంగా ఓట్లు వేసి గెలిపించారు.  విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  


అటువంటి పార్టీతో బాబు పొత్తు పెట్టుకోవడంతో.. 2019 ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యారు. పైగా కేంద్రంలో మోడీతో కలిసి ఉండి ఆ తరువాత మోడీని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇలా వ్యతిరేకించడం వలన బాబుకు చాల డ్యామేజ్ జరిగింది.  మోడీతో కలిసి ఉన్నట్టయితే.. ఒకవేళ ఓటమిపాలైనా కేంద్రంలో కొన్ని పదవులు దక్కేవి.  రాష్ట్రంలో కావాల్సిన పనులను చక్కబెట్టుకోవడానికి అవకాశం దొరికేది.  అలా జరగకపోవడం పార్టీకి పెద్ద డ్యామేజ్.  


ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నారు.  ఇప్పుడు అక్కడ బీజేపీ స్ట్రాంగ్ అవుతున్నది.  పవన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ బలహీన పడటం బీజేపీకి కలిసి వస్తున్నది.  నారా లోకేష్ చిన్నపిల్లోడని, 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడుతుందని, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని బీజేపీ నేత మురళీధర రావు అన్నారు. నారా లోకేష్ కు అంతటి సీన్ లేదని బీజేపీ నేతలు అనడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: