కేంద్ర  మాజీ మంత్రి చిదంబరం అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించకుండా ప్రత్యర్థుల మీద సీబీఐ దాడులు చేయించారు. ఇప్పుడేమో ఆయనే తీహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చిదంబరం రెండేళ్లు నుంచి పలు కేసుల్లో స్టే లు తెచ్చుకుంటూ బతుకుతూ వచ్చారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి తీహార్ జైలు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు కూడా ఇప్పటికే చాలా కేసుల మీద స్టే లు తెచ్చుకున్న సంగతీ తెలిసిందే. మళ్ళీ కేంద్రం గాని వాటి మీద ద్రుష్టి పెట్టి తిరగ తోడైతే బాబు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంకు చంద్రబాబు మధ్య బంధాలు తెగిన సంగతీ తెలిసిందే. 


అయితే చిదంబరం కోసం తీహార్ జైల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. చిదంబరం లాయర్ అభ్యర్ధన మేరకు చిదంబరంకు ప్రత్యేక సెల్ ను కేటాయించబోతున్నారు. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. గతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. 


అలాగే జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఉంటాయి. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారు. అయితే పరిస్థితి చూస్తుంటే చిదంబరంకు బెయిల్ వచ్చేది కష్టంగా మారింది. కేంద్రం కూడా చిదంబరం కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: