చంద్రబాబునాయుడుకు ఇష్టం లేని ఓ డెవలప్మెంట్ గురువారం జరిగిందనే చెప్పాలి.  న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మౌళిక సదుపాయాల కోసం జగన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకు అవరమైన నిధుల కోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విషయం మీదే బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఎన్. జాంగ్ , ప్రాజెక్టు హెడ్ రాజ్ పుర్కర్ తాడేపల్లిలోని జగన్ నివాసంలో చర్చలు జరిపారు.

 

 అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ వైఖరి వల్ల అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు వెనక్కు వెళ్ళిపోయాయంటూ తండ్రి, కొడుకులు ఒకటే గగ్గోలు పెట్టేసిన విషయం తెలిసిందే. జగన్ దెబ్బకు అంతర్జాతీయ స్ధాయిలో ఏపి ఇమేజి పడిపోయిందంటూ నానా యాగీ చేస్తున్నారు. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఏపికి అప్పులు ఇవ్వకూడదని పై బ్యాంకులు రెండూ డిసైడ్ అయ్యాయి. కాకపోతే బ్యాంకులు తమ నిర్ణయాన్ని ప్రకటించేనాటికి చంద్రబాబు దిగిపోయి జగన్ అధికారంలోకి వచ్చారంతే.

 

చివరకు ఈ విషయాన్ని స్వయంగా బ్యాంకులే ప్రకటించినా చంద్రబాబు, చినబాబులు మాత్రం ఒప్పుకోలేదు. జగన్ పై వాళ్ళిద్దరికున్న కసి ఏ స్ధాయిలో ఉందో బయటపడింది. అక్కడి నుండి జగన్ కు వ్యతిరేకంగా తండ్రి, కొడుకులు ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతున్నారు. వాళ్ళ ఉద్దేశ్యంలో రాష్ట్రం ఏ విషయంలో కూడా అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఏ బ్యాంకు, ఆర్ధిక సంస్ధలు ఏపికి అప్పులు ఇవ్వకూడదు.

 

కానీ గురువారం జరిగిన డెవలప్మెంట్ చంద్రబాబు, చినబాబుకు ఏమాత్రం రుచించనిదనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అడిగిన రూ 6 వేల కోట్ల రుణం మంజూరు విషయంలో డైరెక్టర్ల సమావేశంలో పెట్టి బ్యాంకు ఆమోదం తీసుకోనుంది. ఆ విషయాన్నే బ్యాంకు ప్రతినిధులు జగన్ తో చెప్పారు. నిజానికి ప్రభుత్వం రూ. 25 వేల కోట్లకు దరఖాస్తు చేసుకున్నది. స్కూళ్ళు, ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన నీళ్ళతో పాటు ఇతర మౌళిక సదుపాయాలు కల్పించబోతున్నారు. అలాగే రోడ్ల అభివృద్ధిని కూడా చేయబోతున్నారు. బ్యాంకు గనుక రుణం మంజూరు చేస్తే అప్పుడు తండ్రి, కొడుకులు మొహాలను ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: