ప్రధానిగా మోడీ రెండోసారి ఎంపికైన తరువాత మోడీ తన మరింత బలమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నారు. 2014 నుంచి 2019 వరకు దాదాపు 93 దేశాల్లో పర్యటించిన మోడీ, ఆయా దేశాల అధ్యక్షులతో, నాయకులతో చర్చలు జరిపి బలమైన విదేశాంగ విధానం అమలు చేశారు.  ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  ఎలాంటి అవసరం వచ్చినా.. అండగా తామున్నాము అని గుర్తు చేసుకునే విధంగా మోడీ విదేశాంగ విధానం రూపుదాల్చింది.  


ఈ విధానంద్వారా మోడీ..  ప్రతి ఒక్కరు ఇండియాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.  ముఖ్యంగా ముస్లిం దేశాలు ఇండియాకు సపోర్ట్ చేసే విధంగా విదేశాంగ విదేశాంగ విధానం నడిపించారు.  2019లో మోడీ రెండోసారి ప్రధానిగా ఎంపికైన తరువాత.... రెండు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు.  అందులో ఒకటి తలాక్ బిల్లు.  ఈ బిల్లు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నది.  


ఈ బిల్లును ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  గతంలో లోక్ సభలో పాస్ ఆమోదం పొందినా.. రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైంది.  కాగా, రాజ్యసభలో ఇప్పుడు బీజేపీకి మెజారిటీ ఉండటంతో... ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోద ముద్ర వేసుకుంది.  త్రిపుల్ తలాక్ బిల్లును సెమిస్ గా తీసుకొని, ఫైనల్ గా జమ్మూ కాశ్మీర్ విషయంలో 72 సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఆర్టికల్ 370 రద్దును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేశారు.  


దీంతో పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది.  కాశ్మీర్లో ముస్లింలకు అన్యాయం జరుగుతుంటూ  వాదనలు చేసింది.  అంతర్జాతీయంగా ఎన్నో దేశాలను కాశ్మీర్ విషయంలో ఇండియాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది.  కానీ, ఏ దేశం కూడా ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.  కాశ్మీర్ విషయం ఇండియా అంతర్గత వ్యవహారం అని పక్కన పెట్టింది.  ఇది అంతర్జాతీయంగా మోడీ సర్కార్ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.  బ్యాంకుల విషయంలోను మోడీ సర్కార్ ఓ అడుగు ముందుకు వేసి బ్యాంకులను విలీనం చేసే దిశగా అడుగులు వేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఈ వందరోజుల్లో ఇండియా చాలా విషయాల్లో విజయం సాధించిందని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: