గత వారం భారత సైనిక దళం... లైన్ ఆఫ్ కంట్రోల్ (సరిహద్దు) దాటి కాశ్మీర్ లోపలికి చొరపడుతున్న ఇద్దరు టెర్రరిస్టులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిని నజ్నీన్ కొక్కర్ మరియు ఖలీల్ అహ్మద్ లగా ఇండియన్ ఆర్మీ గుర్తించింది. అయితే వారిని ఒక వారం నుండి భారత సైనికాధికారులు విచారిస్తుండగా వాళ్లు కొన్ని నిజాలను వెల్లడించారు. వారి చొరబాటు లో పాకిస్తాన్ ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది అన్న విషయం మీద వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా క్లారిటీ వచ్చేసింది.

వారిలో ఒక టెర్రరిస్టు చెప్పినది ఏమిటంటే తాము గత నాలుగేళ్ల నుండి కశ్మీర్ లోకి ఎలా చొరబడాలి అని చాలా ప్లాన్లు వేసుకున్నారట. వారిద్దరూ పాకిస్తాన్ లోని కచేర్ బాన్ దగ్గర ఒక వారం పాటు సరిహద్దు దాటేందుకు అత్యున్నత ప్రమాణాలు కలిగిన శిక్షణ తీసుకున్నట్లుగా తెలిపారు. వీళ్లిద్దరూ లష్కరే తోయిబా సంస్థకు చెందిన వారని వెల్లడించారు. అంతే వారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కి అక్రమంగా చొరబడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వమే నిధులు సరఫరా చేస్తుందని చెప్పేశారు. తమ క్యాంపులు కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే అనాధికారంగా నడుపుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా జమ్మూ మరియు కాశ్మీర్ లో దాడులు జరిపేందుకు వాళ్ళు చాలా సన్నాహాలు చేస్తున్నారని.... ముందు తమ ఇద్దరి పంపి కాశ్మీr లోయలో కలకలం రేపాలని వారి ప్లాన్ అని చెప్పుకొచ్చారు. ఇలా విషయాన్ని ఇంతకుముందే ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో చెబుతున్నదాని ప్రకారం దాదాపు 100 మంది టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ నుండి కాశ్మీర్ కు వస్తున్నారట. వారితో పాటు 15 జైష్ ఏ మొహమ్మద్ టెర్రరిస్టులు టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ దగ్గర పెట్టుకొని దాడికి సిద్ధంగా ఉన్నారట. 

ఇంకా పట్టుబడ్డ ఇద్దరు టెర్రరిస్టులు చెప్పినదాని ప్రకారం ఆగస్టు 19 మరియు 20va తేదీలలో మఫ్టి రవుఫ్ అస్గర్ మరియు జేఈఎం చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు బహావల్పుర్ దగ్గర టెర్రరిస్ట్ కమాండర్స్ తో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడట. అందులో భాగంగానే కొంతమంది క్రూరమైన టెర్రరిస్టులను కాశ్మీర్లో పంపేందుకు వాళ్లు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రపంచ దేశాలు టెర్రరిస్టులను ప్రోత్సహించకుండా అణిచివేయమని పాక్ ను హెచ్చరించినా వారి తీరు మాత్రం మారడం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి ఇచ్చిన వాంగ్మూలం తో వాళ్ళు చేస్తున్న అతి క్రూరమైన, నీచమైన పనులు బయట పడిపోయాయి. ఇంత నీచానికి పాల్పడిన పాక్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: